రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎలుకలు.. గగ్గోలు పెడుతున్న అన్నదాతలు

|

Apr 04, 2021 | 5:51 PM

పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. వరి పొలాల్లో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు.

రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎలుకలు.. గగ్గోలు పెడుతున్న అన్నదాతలు
Rat
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. వరి పొలాల్లో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. పంటను కాపాడుకునేందుకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 4.6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. గత నెల రోజులుగా పొలాల్లో మూషికాల బెడద పెరిగిపోయింది. దీంతో దాళ్వా పంటను రక్షించుకోవాలంటే ఇప్పుడు కచ్చితంగా నివారణ చేపట్టాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్కువమంది రైతులు ప్రత్యేక బుట్టల ద్వారా ఎలుకలు పట్టేవారిపై ఆధారపడుతున్నారు. బుట్టల ద్వారా ఎలుకలు పట్టేవారికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక్కో ఎలుకకు 20 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తే.. ఆ తర్వాత 50, 70, 80 వరకు చేరింది. కొన్ని చోట్ల డిమాండ్ పెరగడంతో 100 వరకు చెల్లిస్తే గానీ బుట్టలు పెట్టే కూలీలు రావడం లేదు.

గతంలో గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎలుకల బుట్టలు అమర్చేవారు ఉండేవారు. మారుతున్న కాలంతోపాటు కూలీల సంఖ్య బాగా తగ్గిపోయింది. రైతులు వీరిని వెతికి మరీ తీసుకొస్తున్నారు.. అడిగినంత ఇచ్చి ఎలుకలు పట్టిస్తున్నారు. రైతులకు ఖర్చు పెరిగిపోతోంది. ఎలుకలకు ఎర మందు పెట్టినా తినడం లేదు.. ఎలుకలు కూలీలతో ఐదుసార్లు బుట్టలు పెట్టించాల్సి వస్తుండటంతో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఎలుకల బెడద చాలా అధికంగా ఉంది. ఎర మందును ఎలుకలు సరిగా తినడంలేదు. కూలీలతో ఐదుసార్లు బుట్టలు పెట్టించాల్సి రావడంతో ఎకరానికి రూ.2,500 చొప్పున అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఒక్కో ఎలుకకు రూ.100 ఇచ్చినా ప్రస్తుతం ఆ వృత్తిదారులు దొరకడం లేదు. పంట ఈనిక, గింజ గట్టిపడే దశలో ఎలుకలు దాడి చేస్తే దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vakeel Saab: నివేదా థామస్ కు కరోనా పాజిటివ్… అలర్ట్ అయిన వకీల్ సాబ్ చిత్రయూనిట్.. టీమ్ కు కరోనా టెస్టులు..

Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..

Prabhas : తమిళ్ స్టార్ డైరెక్టర్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే చెప్పాడా…