Hand Writing: హ్యాండ్ రైటింగ్ ను మెరుగుపరుచుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మంచి మార్కులతో పాటు.. ఇంకెన్నో..

|

Oct 22, 2022 | 9:30 PM

స్టూడెంట్ కెరీర్ లో మంచి చేతి రాత చాలా ఇంపార్టెంట్. దస్తూరి బాగా ఉన్నవారు అధిక మార్కులు కూడా సాధిస్తుంటారు. అందంగా రాయడం వల్ల విషయం త్వరగా అర్థమవడమే కాకుండా మంచి ఇంప్రెషన్..

Hand Writing: హ్యాండ్ రైటింగ్ ను మెరుగుపరుచుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మంచి మార్కులతో పాటు.. ఇంకెన్నో..
Hand Witing Skills
Follow us on

స్టూడెంట్ కెరీర్ లో మంచి చేతి రాత చాలా ఇంపార్టెంట్. దస్తూరి బాగా ఉన్నవారు అధిక మార్కులు కూడా సాధిస్తుంటారు. అందంగా రాయడం వల్ల విషయం త్వరగా అర్థమవడమే కాకుండా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అయితే చేతి రాత బాగా లేకుండా రాసిన కంటెంట్ ను అర్థం చేసుకోవడంలో టీచర్ కు ఇబ్బందులు కలుగుతుంటాయి. దీంతో వారి పట్ల ప్రతికూల ప్రభావం కలుగుతుంది. చివరికి ది ఒకరి గ్రేడ్‌లను ప్రభావితం చేసే స్థితికి వస్తుంది. ప్రస్తుతం మారిపోతున్న సాంకేతికత కారణంగా డిజిటలైజేషన్ పెరిగిపోతున్నప్పటికీ పాఠకులకు అనుకూలమైన చేతిరాతను కలిగి ఉండటం విద్యార్థులకు చాలా ముఖ్యం. చేతి రాతను మెరుగుపరుచుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. ప్రతిరోజూ కొంత సమయం ఏదో ఒక విషయం గురించి చేతితో రాయాలి. ఇది చేతిరాతను మెరుగుపరచడానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కంటెంట్ పట్ల మంచి అభిప్రాయం కలిగించి, వారు చక్కగా రాసే పరిస్థితులను కల్పించాలి.

విద్యార్థులు పెన్ను పట్టుకునే విధానంలో నూ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. బొటనవేలు, చూపుడు వేలు సహాయంతో చాలా మంది రాస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఈ రెండు వేళ్లతో పాటు పెద్ద వేలు సహాయం తీసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటో మీరే గుర్తించగలుగుతారు. పిల్లలు హోమ్ వర్క్ చేసే సమయంలో, రాస్తున్నప్పుడు సరిగ్గా కూర్చోమని చెప్పాలి. కూర్చునే విధానం కూడా చేతిరాతపై ప్రబావం చూపిస్తుంది. రాయడానికి అనువుగా నిటారుగా కూర్చోవాలి. టేబుల్ సహాయంతో రాసేవారు ముంజేయిని టేబుల్‌పై ఉంచాలి. ఇది మణికట్టుపై కాకుండా వేళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. చాలా మంది పిల్లలు రాసేటప్పుడు పేజీ చుట్టూ చేతులు వంచడం అలవాటు చేసుకున్నారు. దీనిని క్రమంగా దూరం పెట్టడం చాలా అవసరం.

పెన్ను ఎంచుకోవడం చాలా అవసరం. ఇది మీ పిల్లలకు వారి రచనపై మరింత నియంత్రణను కలిగిస్తుంది. పెన్నుతో రాసేటప్పుడు పిల్లల చేతికి విశ్రాంతి ఉండాలి. మంచి రచన కోసం లైన్లు ఉన్న కాగితాన్ని ఎంచుకోవాలి. అక్షరాలు సరిగ్గా రాస్తున్నామని నిర్ధారించుకోవడానికి ఇది సహాయపడుతుంది. రాసేటప్పుడు కాగితం కింది భాగంలో ప్యాడ్ ను పెట్టుకోవాలి. నిదానంగా, తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా రాస్తే చక్కటి చేతిరాతను మీ సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి