AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot: క్యారెట్ తొక్కలను పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో సహాయం చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు శరీరానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయి. చాలా మంది క్యారెట్ తినేటప్పడు పొట్టు తీసేస్తుంటారు...

Carrot: క్యారెట్ తొక్కలను పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
Carrot
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 29, 2022 | 9:50 AM

కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో సహాయం చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు శరీరానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయి. చాలా మంది క్యారెట్ తినేటప్పడు పొట్టు తీసేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యారెట్ పీల్ లో అధికంగా ఫోషక పదార్థాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో విటమిన్ సి, బీ3 ఉంటాయి. క్యారెట్ పీల్ తో ఇతర వంటకాలనూ తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తొక్కలను ఉప్పు నీటిలో మరిగించి, ఆ నీటితో సూప్‌లు, కూరలు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. తద్వారా ఇందులో ఉండే పోషక పదార్థాలన్నీ శరీరానికి అందుతాయి. పీల్ లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి ఆకలి తగ్గించి, బరువు పెరగకుండా సహాయపడుతుంది. క్యారెట్ పీల్ తో చిప్స్ తయారు చేసుకోవచ్చు. నూనెలో వేయించడం లేదా ఎండలో ఆరబెట్టడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

బేక్ చేయడానికి లేదా ఆరబెట్టడానికి, వేయించడానికి ముందు రుచి కోసం మూలికలు, మసాలా దినుసులను యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తొక్కలకు తులసి, పైన్ గింజలు, ఆలివ్ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. వాల్‌నట్, పిస్తాతో పాటు క్యారెట్ తొక్కలను చేర్చడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను జోడించవచ్చు. అంతే కాకుండా ఆరబెట్టిన క్యారెట్ తొక్కలను పొడి చేసుకుని, వాటిని కూరల్లో వేసుకోవచ్చు.

ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చలి కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో క్యారెట్ కూడా ఒకటి. నిజానికి క్యారెట్ వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కంటి ఆరోగ్యంతో పాటు ఒంట్లోని కొవ్వును కరిగించడానికి క్యారెట్ ఉపయోగపడుతుంది. యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సమస్యలను నివారిస్తాయి. హై బీపీ తో బాధపడే వాళ్లకు కూడా క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా క్యారెట్ బాగా హెల్ప్ చేస్తుంది. క్యారెట్‌లో వుండే విటమిన్స్ జుట్టు పొడిబారకుండా ఉంచుతాయి. ఇలా క్యారెట్ వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి