Fish: తాజా చేపలు ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..

|

Feb 05, 2023 | 3:16 PM

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ వైపు మనసు మళ్లుతుంది. చికెన్, మటన్, లేదా చేపలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. చాలా మందికి తాజా చేపలు ఎలా కొనాలో తెలియదు. ..

Fish: తాజా చేపలు ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..
Fish Purchasing
Follow us on

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ వైపు మనసు మళ్లుతుంది. చికెన్, మటన్, లేదా చేపలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. చాలా మందికి తాజా చేపలు ఎలా కొనాలో తెలియదు.  చేపల డిమాండ్‌ను బట్టి కొన్ని సార్లు చీటింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా చేపలను ఐస్ క్యూబ్ బాక్సుల్లో రెండు మూడు రోజుల పాటు ఉంచి తర్వాత అమ్ముకోవచ్చు. అలా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి ఉత్తమమైన చేపలను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం. చేపలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఆరోగ్యకరమైన ఆహారం. పిల్లల నుంచి పెద్దల వరకు నిర్భయంగా చేపలను తినవచ్చు. చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అందుతాయి. అందుకే వారానికి ఒక్కసారైనా చేపలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

చేపలు మెరుస్తూ మంచి రంగులో ఉండాలి. చేపల కళ్లను చెక్ చేయాలి. స్పష్టంగా ఉంటే అది మంచి చేప అని అర్థం. చేపల కళ్ళు మబ్బుగా ఉంటే, దానిని కొనవద్దు. మీ వేలితో చేప శరీర భాగాన్ని నొక్కండి. గట్టిగా ఉంటే మంచి చేప. అది మృదువుగా ఉంటే తినడానికి పనికి రాని చేపగా గుర్తించాలి. తాజా చేప తోకను పట్టుకున్నప్పుడు మెరుస్తుంది. అదే కొద్ది రోజులు నిల్వ ఉన్న చేపల శరీరభాగం వదులుగా మారి, మృదువుగా మారుతుంది. చేపల మొప్పలను చెక్ చేయాలి. రక్త ప్రవాహం తాజాగా ఉంటే మంచి చేప. చేపల రక్తం గడ్డకట్టినట్లయితే.. అవి ఐస్ ప్యాక్‌లో స్టోర్ చేయబడ్డాయి అని అర్థం. చేపలు ఎక్కువ దుర్వాసన వస్తే అవి పాడయిపోయినవి.

సో.. ఈ టిప్స్ ఫాలో అయ్యి.. మంచి తాజా చేపలు కొనుగొలు చేసి హెల్తీ బెనెఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. చేపలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. త్వరగా జీర్ణం అవడమే కాకుండా.. కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి