Flight Journey: విమాన ప్రయాణంలో ఈ మాట అన్నారంటే మీ పని అవుట్! బ్లాక్ లిస్టులో పెట్టేస్తారు..విమానంలో ఇలా అస్సలు చేయకండి!

|

Oct 31, 2021 | 8:42 AM

ప్రతిరోజు పదివేల మంది ప్రజలు తమ కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి విమానంలో ప్రయాణిస్తారు. విమానంలో ప్రయాణం సమయం ఆదా చేయడమే కాకుండా చాలా మందికి తప్పనిసరి కూడాను.

Flight Journey: విమాన ప్రయాణంలో ఈ మాట అన్నారంటే మీ పని అవుట్! బ్లాక్ లిస్టులో పెట్టేస్తారు..విమానంలో ఇలా అస్సలు చేయకండి!
Flight Journey Rules
Follow us on

Flight Journey: ప్రతిరోజు పదివేల మంది ప్రజలు తమ కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి విమానంలో ప్రయాణిస్తారు. విమానంలో ప్రయాణం సమయం ఆదా చేయడమే కాకుండా చాలా మందికి తప్పనిసరి కూడాను. అయితే, విమానంలో ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. తోటి ప్రయాణీకులతో.. విమాన సహాయ సిబ్బందితో పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ పధ్ధతి తప్పితే విమానం నుంచి దించివేయడమే కాకుండా.. ఒక్కోసారి బ్లాక్ లిస్టులో పెట్టె ప్రమాదం కూడా ఉంటుంది.
విమాన భద్రతా కోసం ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు. ఎటువంటి పరిస్థితిలోనూ నిబంధనలు అతిక్రమించిన వారిని ఉపెక్షించరు.

విమానంలో తాగొచ్చు.. తాగి విమానం ఎక్కలేరు..

ఏమిటి విచిత్రంగా అనిపిస్తోందా? అవును ఇది కరెక్టే.. మీరు తాగి విమానం ఎక్కలేరు. కానీ, విమానంలో మద్యం తాగడానికి మీకు అనుమతి ఉంటుంది. అయితే, అది మీరెక్కిన విమానంలో మద్యం అందుబాటులో ఉన్న పరిస్తితిలోనే సాధ్యం అవుతుంది. విమాన సహాయ సిబ్బందిని మద్యం కోసం అడగవచ్చు. లభ్యత ఉంటె వారు మీకు సప్లై చేస్తారు. అయితే, పరిమితిలోనే ఉండాల్సి ఉంటుంది.

ఈ మాట అన్నారో మీ పని ఖాళీ!

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. విమానం ఎక్కేటప్పుడు మీరు మద్యం సేవించి ఉన్నట్టు విమాన సిబ్బంది గుర్తిస్తే మిమ్మల్ని విమానం ఎక్కకుండా ఆపుచేసే అధికారం వారికి ఉంటుంది. ఇక ఒకవేళ మీరు విమాన ప్రయాణంలో ఉండగా.. విమాన సిబ్బంది లేదా తోటి ప్రయాణీకులకు మీరు మద్యం తాగి ఉన్నాను అని జోక్ గా చెప్పినా అది తీవ్రంగా పరిగణిస్తారు. ఆ మాట అన్నవెంటనే.. దగ్గరలోని విమానాశ్రయంలో విమానం ఆపించి మరీ కిందకు దించేస్తారు. అంతేకాదు మీరు ఈ మాట ఫ్లైట్ అటెండెంట్‌తో కనుక అంటే, మీకు లక్షరూపాయల జరిమానాతో పాటు.. మూడేళ్ళు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, విమానయాన సంస్థల నుంచి మీ పేరు బ్లాక్ లిస్టులోకి చేరిపోయే ప్రమాదం ఉంటుంది.

తాగిన ప్రయాణికులను విమానం ఎక్కకుండా ఆపడానికి క్యాబిన్ సిబ్బంది.. విమాన సహాయకులకు హక్కు ఉంటుంది. విమానం టేకాఫ్ చేసిన తర్వాత, ఒక ప్రయాణీకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని వారికి తెలిస్తే, వారు ప్రయాణీకులను సమీపంలోని విమానాశ్రయంలో దింపవచ్చు.

విమాన ప్రయాణంలో అతి ముఖ్యమైనది ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం. నిబంధనలు అతిక్రమించకుండా ఉండడం. వీటిలో ఏ పొరపాటు చేసినా మీరు చిక్కుల్లో పడక తప్పదు.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Rahul Gandhi: మోటర్ సైకిల్‌ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..

Postal Jobs: ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ..