
హిందూమతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదనే విషయాలను ప్రస్తావించారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెబుతుంటారు. ఇలాంటి వాటిలో రాత్రుళ్లు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రి పూట చేయకూడని ఆ పనులు ఏంటి.? వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రాత్రి పూట చేయకూడని పనుల్లో గోర్లు కత్తిరించుకోవడం ఒకటి. అలాగే జుట్టును కూడా కట్ చేసకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే మంగళ, గురు, శనివారాల్లో జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెబుతున్నారు.
* ఇక రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెబుతుంటారు.
* రాత్రి సమయంలో చేయకూడని మరో పని రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత పసుపు, నూనె, పాలు-పెరుగు వంటి వాటిని ఎవరీకి ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు.
* సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దుస్తులు ఉతకకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. రాత్రిపూట దుస్తులు ఉతకడం, ఎండబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు. బయట దుస్తులు ఆరబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వాటిలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో బట్టలు ఉతకడం అంత మంచిది కాదని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..