Tulsi Plant: తులసి మొక్క ప్రతిసారి ఎండిపోతోందా? ఈ 4 సూచనలు పాటించండి.. ఎప్పటికీ ఎండిపోదు..!

|

May 29, 2023 | 7:13 PM

హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల శుభం జరుగుతుందని విశ్వాసం. హిందువులు తమ తమ ఇళ్లలో తులసి మొక్కను నాటి, ప్రతి రోజూ ఉదయం పూజలు చేస్తారు. అయితే, తులసి మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా,

Tulsi Plant: తులసి మొక్క ప్రతిసారి ఎండిపోతోందా? ఈ 4 సూచనలు పాటించండి.. ఎప్పటికీ ఎండిపోదు..!
Tulasi Rules
Follow us on

హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల శుభం జరుగుతుందని విశ్వాసం. హిందువులు తమ తమ ఇళ్లలో తులసి మొక్కను నాటి, ప్రతి రోజూ ఉదయం పూజలు చేస్తారు. అయితే, తులసి మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా, ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. తులసి ఆకులను తినడం వల్ల, తులసి ఆకు రసాన్ని తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు , గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. కానీ, ఈ మొక్క సంరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది త్వరగా ఎండిపోతుంది. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా పదే పదే తులసి మొక్క ఎండిపోతోందా? అలా కాకుండా ఉండేందుకు ఇవాళ కొన్ని తెలుసుకుందాం..

ఎక్కువ నీరు పోయొద్దు..

చాలా మంది తులసి మొక్కకు ఎక్కువగా నీరు పోస్తారు. ఇలా చేయడం వల్ల చెట్టు మూలాల్లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. అలా చెట్టు ఎండిపోయే అవకాశం ఉంది. అందుకే తులసి చెట్టుకు ఎక్కువ నీరు పోయొద్దు.

సరైన మట్టిని వేయాలి..

తులసి మొక్క త్వరగా ఎండిపోకూడదు అనుకుంటే.. సరైన మట్టిని ఉపయోగించాలి. ఈ మట్టిలో ఎలాంటి కల్తీ ఉండకూడదు. కుండీలో 70 శాతం మట్టి, 30 శాతం ఇసుక ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆవు పేడ వాడకం..

కొందరు తులసి మొక్క పాడవకుండా ఉండేందుకు ఏవేవో ఎరువులు వాడుతారు. అయితే, వీటన్నింటికంటే.. ఆవు పేడను ఎరువుగా వినియోగించడం మేలు చేస్తుంది. ఎండిన ఆవు పేడను పొడిగా చేసి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయడం వల్ల చెట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.

సరైన కుండీని వాడాలి..

తులసి మొక్కను నాటడానికి సరైన కుండీని వినియోగించాలి. దిగువన రంధ్రం ఉండేలా చూసుకోవాలి. తద్వారా అధికంగా నీరు ఉంటే మొక్క మూలాల్లో నిలిచిపోకుండా రంధ్రం ద్వారా బయటకు వెళ్తుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..