Washing Machine: వాషింగ్ మిషిన్‌ కెపాసిటీ కేజీలలోనే ఎందుకు కొలుస్తారు.? దీని వెనకాల అసలు కారణం ఏంటంటే..

ప్రస్తుతం చాలా ఇళ్లల్లో వాషింగ్ మిషిన్స్‌ వినియోగం పెరిగింది. ఒకప్పుడు భారీగా ఉన్న ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అందులోనూ ఈ కామర్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాషింగ్‌ మిషిన్స్‌ కొనుగోలు చేస్తున్న వారి..

Washing Machine: వాషింగ్ మిషిన్‌ కెపాసిటీ కేజీలలోనే ఎందుకు కొలుస్తారు.? దీని వెనకాల అసలు కారణం ఏంటంటే..
Washing Machine

Updated on: Dec 25, 2022 | 12:52 PM

ప్రస్తుతం చాలా ఇళ్లల్లో వాషింగ్ మిషిన్స్‌ వినియోగం పెరిగింది. ఒకప్పుడు భారీగా ఉన్న ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అందులోనూ ఈ కామర్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాషింగ్‌ మిషిన్స్‌ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వాషింగ్ మిషిన్‌ను కొనుగోలు చేసే సమయంలో ఫ్రంట్‌ లోడ్‌, టాప్‌ అనే ఆప్షన్స్‌ను చూస్తారు. ఇక తర్వాత చూసే అంశం వాషింగ్ మిషిన్‌ కెపాసిటీ.

వాషింగ్ మిషిన్‌ను కొనుగోలు చేసే సమయంలో కెపాసిటీ ఎన్ని కిలోలు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి వాషింగ్‌ మిషిన్‌ కెపాసిటీని లీటర్లలో కొలవకుండా, కేజీలలో ఎందుకు కొలుస్తారని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాషింగ్‌ మిషన్‌ పై ఉండే కేజీలు అది మిషిన్‌ బరువును కాకుండా దాని సామర్థ్యాన్ని సూచిస్తుంది.

వాషింగ్‌ మిషిన్‌లో వేసే దుస్తుల బరువును ఈ కెపాసిటీ సూచిస్తుంది. అయితే ఇది పొడి దుస్తుల కెపాసిటీని సూచిస్తుంది. ఉదాహరణకు మీరు ఉపయోగిస్తున్న వాషింగ్ మిషిన్‌ కెపాసిటీ 7 కిలోలు అనుకుందాం.. ఈ లెక్కన మీ వాషింగ్ మిషన్‌ 7 కిలోల పొడి దుస్తువులను ఉతికే కెసాసిటీ కలిగి ఉంటుందని అర్థం. అయితే ఈ దుస్తులకు కలిసే నీరు బరువు లెక్కలోకి రాదు. ఇదండీ వాషింగ్‌ మిషిన్స్‌ కెపాసిటీ వెనకాల ఉన్న అసలు ఉద్దేశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..