
మనిషి జీవితంలో ముఖ్య ఘట్టాల్లో వివాహం ఒకటి. అందుకే ఎవరి స్థాయికి తగ్గట్లు వారు, వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. పెళ్లిని ఓ వేడుకగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతీ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు.
ఈ క్రమంలోనే వెడ్డింగ్ ప్లానర్స్ సైతం ఈవెంట్స్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. వివాహ వేడుకల్లో కీలక ఘట్టాల్లో హల్దీ వేడుక ఒకటి. హల్దీ ఫంక్షన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. వదూవరులకు పసుపు రాస్తూ చేసే ఈ వేడుక వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటి.? అసలు హల్దీ వేడుకను ఎందుకు జరుపుతారు..? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వధూవరులకు పసుపు పూస్తూ, కుటుం సభ్యులు, స్నేహితులు హల్దీ వేడుకను నిర్వహిస్తుంటారు. అయితే ఇలా పసుపు రాసుకోవడం వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే. పసుపు అంటేనే ఔషధాలకు పెట్టింది పేరని ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. పసుపు లేంది ఎలాంటి వంటకాన్ని చేయమని తెలిసిందే. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫమేటరీ ఏజెంట్‌గా పసుపు పనిచేస్తుంది. కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మహిళలు ముఖానికి పసుపు రాసుకుంటారు.
చర్మాన్ని మెరుగుపరిచి, ప్రకాశవంతంగా చేయడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వివాహానికి ముందు హల్దీ వేడుకను ఒక ఆచారంగా మార్చారు. పెళ్లి సమయంలో అందం మెరుగవడంతో పాటు.. యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా వారికి రక్షణ ఇస్తుందని పసుపును ఉపయోగిస్తుంటారు. ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేయడం ద్వారా శరీరంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. అందుకే వివాహ వేడుక సమయంలో వదూవరులు సరికొత్త అందం సంతరించుకుంటారు.
దీంతో పాటు హల్దీ వెనకాల మరో ఉద్దేశం ఉంది. ముత్తైదువులంతా కలిసి వధూవరులకు పసుపు రాస్తారు. దీని ప్రకారం వారి దీవెనలు జంటకు దక్కుతాయని నమ్ముతుంటారు. పసుపు రాసి మంగళస్నానం చేయడం వల్ల శరీరంపై ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే హల్దీకి పెళ్లిల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..