వాహ్ కేరళ.. శీతాకాలంలో ఈ ప్లేసులు.. భువి యందు స్వర్గాలు.. 

Prudvi Battula 

Images: Pinterest

12 December 2025

టీ తోటలకు ప్రసిద్ధి చెందిన మున్నార్, శీతాకాలంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. చల్లని వాతావరణంలో మీరు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

మున్నార్

దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలకు ప్రసిద్ధి చెందింది. పొగమంచుతో కూడిన ఉదయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

వయనాడ్

పచ్చిక బయళ్ళు, పైన్ అడవులు, పొగమంచుతో కప్పబడిన పర్వత శ్రేణులతో అద్భుతమైన దృశ్యలను చూడవచ్చు. శీతాకాలపు పర్యటనకు ఇది అనువైన ప్రదేశం.

వాగమోన్

ఇది కొంతమందికి మాత్రమే తెలిసిన అందమైన హిల్ స్టేషన్. మీరు ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇది ట్రెక్కింగ్‌కు మంచి ప్రదేశం.

పొన్ముడి

ఇడుక్కి జిల్లాలో తేక్కడి ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడమే కాకుండా, వన్యప్రాణులను చూడవచ్చు. హాయిగా బోటింగ్ చెయ్యవచ్చు.

తేక్కడి

కందలూర్ కేరళ మినీ కాశ్మీర్ గా పరిగణించబడుతుంది. ఇది అడవులు, జలపాతాలతో నిండిన అందమైన పర్యాటక కేంద్రం.

కందలూర్

కేరళ నుండి ఊటీ కొన్ని గంటల డ్రైవ్ దూరంలోనే ఉంది. చల్లని వాతావరణంలో మీరు బొటానికల్ గార్డెన్, సరస్సు, దొడబెట్టను చూడవచ్చు.

ఊటీ

ఇది తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళకి చాలా దగ్గర. చాలా ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. శీతాకాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది.

కొడైకెనాల్