
కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కచ్చితంగా కలలు వస్తాయి. అయితే కలలో కనిపించే దృశ్యాలు మన జీవితంపై ప్రభావితం చూపుతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలతో పాటు, పండితులు కూడా చెబుతుంటారు. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుందని వివరిస్తారు. మరి నిద్రలో పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే ఎలాంటి దానికి అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం..
* పెళ్లికాని వారికి కలలో పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే.. మీరు ఏదో ఒక జర్నీని ప్రారంభించబోతున్నారని అర్థం. అయితే అది పెళ్లి మాత్రమే కావాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కావొచ్చు, వ్యాపారమైన కావొచ్చు. జీవితంలో ఓ ప్రధాన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని అర్థం.
* ఇంట్లో వివాహ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నట్లు కల వస్తే.. మీరు ఏదో తెలియని ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారని అర్థం. మీరు మానసికంగా ఆందోళనతో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.
* ఇక పెళ్లి అయిన వారికి ఒకవేళ కలలో పెళ్లి జరుగుతున్నట్లు కల వేస్తే.. మీరు మీ జీవిత భాగస్వామి విషయంలో ఏదో అసంతృప్తితో ఉన్నారని అర్థం. మీ భాగస్వామి నుంచి మీరు మరింత ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటున్నారని అర్థం. అంతేకానీ మరో పెళ్లి చేసుకోబుతున్నారని మాత్రం కాదు.
* ఇక ఎదుటి వ్యక్తుల వివాహాం అవుతున్నట్లు కల వస్తే దానర్థం.. మీరు కుటుంబంలో లేదా,స్నేహితులతో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..