
రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ రోజూ మనకు కలలో ఎన్ని రకాల కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు. మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది.? దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వారు బతికున్న సమయంలో మీతో ఏదైన తీరని కోరిక గురించి తెలిపినట్లైతే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు.
* ఇక ఒకవేళ మీ కుటుంబానికి చెందిన మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి.
* చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కలలు మీకు వస్తే మంచి జరగనుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
* ఒకవేళ చనిపోయిన మీ బంధులు కలలో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయాలని చెబుతున్నారు.
* చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది మంచికి సూచనగా చెబుతున్నారు. ఇలా కనిపిస్తే రానున్న రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
* మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది. ఈ కల వస్తే మీకు మంచి జరగనుందని అర్థం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..