Lifestyle: నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా.? మీకు ఈ సమస్య ఉన్నట్లే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 100 మందిలో, దాదాపు 80 మందికి ఈ రకమైన సమస్య ఉంటుందని అంటున్నారు. దీని వల్ల కొన్నిసార్లు అనేక రకాల సమస్యలు తలెత్తి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని. ఈ మానసిక సమస్యతో బాధపడుతుంటే నిర్ణయం తీసుకోవడంలో భయం, ఇబ్బందులు పడుతుంటారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మతగా చెబుతున్నారు...

Lifestyle: నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా.? మీకు ఈ సమస్య ఉన్నట్లే..
Decidophobia
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 10:30 PM

జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం తీసుకునే నిర్ణయమే మనల్ని నిర్వచిస్తుంది. అయితే మనలో కొందరు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. పెద్ద పెద్ద విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదరుకావడం కామన్‌ కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే మాత్రం మీరు ‘డెసిడోఫోబియా’ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 100 మందిలో, దాదాపు 80 మందికి ఈ రకమైన సమస్య ఉంటుందని అంటున్నారు. దీని వల్ల కొన్నిసార్లు అనేక రకాల సమస్యలు తలెత్తి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని. ఈ మానసిక సమస్యతో బాధపడుతుంటే నిర్ణయం తీసుకోవడంలో భయం, ఇబ్బందులు పడుతుంటారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మతగా చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆందోళన లేదా ఒత్తిడికి గురవుతుంటారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో విపరీతమైన చెమటలు పడుతుంటాయి. అలాగే తలనొప్పి, హృదయ స్పందనలో మార్పులు వస్తాయి. స్వంత నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

ఈ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కుటుంబ నేపథ్యం, వారు నివసిస్తున్న పరిస్థితులు, వారికి వచ్చే అవకాశాలు కారణాలు అవుతుండొచ్చని అంటున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. వృత్తి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఆందోళన, ఒత్తిడి కారణంగా డిప్రెషన్ లేదా ఆందోళన సంభవించవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సానుకూలంగా ఆలోచిండచం అలవాటుగా మార్చుకోవాలని చెబుతున్నారు. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి, ప్రతిరోజూ ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?