Aadhar Card: సిమ్ కార్డు నుంచి ఫ్లైట్ టికెట్ వరకు… తాజాగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఏ చిన్న పని అయినా ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండానే చాలా చోట్ల మన ఆధార్ కార్డును ఇచ్చేస్తుంటాం. మరి ఎన్నో చోట్ల ఆధార్ జిరాక్స్‌లను ఇస్తున్నారు కదా.. ఆధార్ కార్డు దుర్వినియోగం కాదా..? అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా.? అవును సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో డేటా మిస్ యూజ్ అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి.
అయితే మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా మీ కార్డు డేటాను భద్రంగా ఉంచుకోవచ్చనే విషయం మీకు తెలుసా? చాలా సింపుల్ స్టెప్స్‌తో మీ ఆధార్ కార్డు హ్యాక్‌కి గురికాకుండా చేసుకోవచ్చు. ఇందు కోసం ఏం చేయాలంటే..
* ముందుగా https://resident.uidai.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం మై ఆధార్‌లోకి వెళ్లి.. అందులో ఉండే ఆధార్ సర్వీస్ అనే అప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత అక్కడ కనిపించే లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* అనంతరం మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాలి.
* దీంతో ఓ క్యాప్చ్ కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే.. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వెళుతుంది.
* ఓటీపీని ఎంటర్ చేసి బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు. అవనసరమైనప్పుడు అన్‌లాక్ చేసుకోవచ్చు.
Also Read: చింతపండు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..! ఎవరు తినొచ్చు.. ఎవరు తినకూడదు..? తెలుసుకోండి..
సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు సరికావు, ఇండియన్ రేడియాలజీ సంస్థ ఖండన
కొత్తిమీర జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలు..! కొవిడ్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి..