ఇంట్లో ఉండే వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై వాస్తు ప్రభావం కచ్చితంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారత దేశంలో వాస్తును విశ్వసించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో ఏ దిశలో ఎలాంటి వస్తువులు ఉంటాయన్నది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇంట్లో వాస్తు లోపం ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. దీని కారణంగానే చిరాకు, మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయాలనిపించదు, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అయితే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ఆరోగ్యం సొంతమవుతుంది. ఇంతకీ ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా మానసిక ఒత్తడి దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే బయటపడేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య తరుచుగా గొడవులు జరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి విరిగిన పాత్రలు కూడా ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి.
* ఇంట్లో అద్దాన్ని ఎప్పుడూ దక్షిణం లేదా పడమర దిశలో ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో ఉండేవారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఎదురెదురుగా రెండు అద్దాలు ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో పగిలిన అద్దాన్ని కూడా ఉంచకోకూడదు, దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
* ఇక పెళ్లి కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశలో నిద్రించకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. పెళ్లికానీ వారు నైరుతి దిశలో పడుకున్న వారి స్వభావంలో దూకుడు పెరుగుతుంది, చిరాకు వేధిస్తుంది.
* వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి గోడలకు డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
* కోపంగా, ఉగ్రంగా కనిపించే దేవుడి బొమ్మలను ఇంట్లో అలంకరణగా పెట్టుకోవద్దని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఎలాంటి హింసాత్మక చిత్రాలు కూడా ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఇలాంటి ఫొటోలు పెట్టుకుంటే.. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..