Youngest Cadaver Donor: 20 నెలల చిన్నారి మరణిస్తూ.. ఐదుగురికి ప్రాణాలు పోసింది. అతిచిన్న వయసులో అవయదాతగా నిల్చింది.

చిన్నవయసులో మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.. ఆలా 20 నెలల వయసున్న ఓ చిన్నారి మృత్యు ముఖంలోకి చేరుకుంది... తాను వెళ్తూ.. మరో ఐదుగురి జీవితాలకు ఆయుస్సు...

Youngest Cadaver Donor: 20 నెలల చిన్నారి మరణిస్తూ.. ఐదుగురికి ప్రాణాలు పోసింది. అతిచిన్న వయసులో అవయదాతగా నిల్చింది.

Updated on: Jan 14, 2021 | 5:01 PM

Youngest Cadaver Donor: కొందరు మరణించీ చిరంజీవి… మానవత్వంతో చేసిన పనులతో వారి శరీరానికి మాత్రమే మరణం.. ఇతరుల మనస్సులో వారు ఎప్పుడూ ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతారు. పుట్టిన మనిషి మరణించక తప్పదు.. అయితే మరీ చిన్నవయసులో మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.. ఆలా 20 నెలల వయసున్న ఓ చిన్నారి మృత్యు ముఖంలోకి చేరుకుంది. ఆడుకుంటూ బాల్కానీ నుంచి పడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11న బ్రెయిన్ డెడ్ అయ్యింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో 20 నెలలకే నూరేళ్లు నిండిపోయాయి. కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తూ తిరిగిలోకానికి వెళ్ళిపోయింది. అయితే తాను వెళ్తూ.. మరో ఐదుగురి జీవితాలకు ఆయుస్సు పోసింది. దేశంలోనే అతి చిన్న వయసులో అవయవదాతగా నిలిచింది చిన్నారి ధనిష్ఠ.

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఆశిశ్ కుమార్‌, బబిత దంపతుల కూతురు ధనిష్ఠ ఈనెల 8న బాల్కనీలో నుంచి కింద తీవ్రంగా గాయపడింది. గంగారామ్ ఆసుపత్రికి చికిత్స పొందుతుంది. అయితే చిన్నారి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. అంతటి విషాదంలోనూ తల్లిదండ్రులు ఆశిశ్ కుమార్‌, బబితా.. ఆ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. ఇప్పడా అవయవాలే ఐదుగురికి ప్రాణాలను నిలబెట్టిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. ధనిష్ఠ పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషెంట్లకు అమర్చారు. తమ పాపా మరణించినా ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని తలిదండ్రులు కన్నీటితో చెప్పడం చూపరులను భావోద్వేగానికి గురి చేసింది.

Also Read: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న వైరస్… 8నెలలు తర్వాత ఒకరు మృతి