Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు

ఎందరో మానవతావాదులు ముందుకు వచ్చిన ఆర్థిక సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు తానూ సేకరించిన ధనాన్ని కోవిడ్ సంక్షేమానికి అందజేత...

Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు
Tamilnadu Beggar Donates Funds To Covid Relief

Edited By:

Updated on: Jul 10, 2021 | 1:45 PM

Beggar Donates Funds to Covid Relief: కరోనా మహమ్మారి మిగులుస్తున్న కష్టాలు అంతా ఇంతాకాదు. కోవిడ్ బారినపడి జనం ఆర్థికంగా చితికిపోయారు. లాక్‌డౌన్ కారణంగా ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్న సామెతగా మారిపోయింది. వైరస్ కాటుకు ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయితే, ఎందరో మానవతావాదులు ముందుకు వచ్చిన ఆర్థిక సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు తానూ సేకరించిన ధనాన్ని కోవిడ్ సంక్షేమానికి వినియోగిస్తూ అందరి మన్నలు పొందుతున్నాడు.

తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం ప్రాంతానికి చెందిన వృద్ధుడు పూలపాండ్యన్‌ (68) కరోనా నివారణ సహాయ నిధికి రూ.20వేలు విరాళంగా పంపి మరోమారు ప్రశంసలందుకున్నాడు. పూల పాండ్యన్‌ భార్య మృతి చెందటంతో ఒంటరివాడయ్యారు. కుమారుడితో మనస్పర్థలు రావడంతో ఇల్లు విడిచి భిక్షాటన చేస్తూ బ్రతకుతున్నారు. తన రోజువారీ ఖర్చులు పోగా.. మిగిలిన సొమ్మంతా సామాజిక ప్రయోజనాల కోసం విరాళంగా అందిస్తున్నారు.

గతేడాది నుంచి భిక్షాటన ద్వారా సంపాదించిన సొమ్మును కరోనా నివారణ సాయం కోసం, విద్యార్థుల చదువులకు అందించి దానశీలిగా పేరుతెచ్చుకున్నాడు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి దాకా మదురై తదితర నగరాల్లో భిక్షమెత్తి సుమారు లక్ష రూపాయలను ప్రభుత్వ కరోనా నివారణ సహాయ నిధికి అందించి పలువురి ప్రశంసలందుకున్నాడు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో రావడటంతో పూలపాండ్యన్‌ భిక్షమడిగితే ప్రజలు చిల్లరకు బదులుగా ఐదు, పది, ఇరవై, యాభై, వంద నోట్లను వేస్తున్నారు. భిక్షాటన ద్వారా తనకు వేలాది రూపాయలు లభిస్తున్న ఆయన ఒంటరిగా వున్న తనకు మూడు పూటల భోజనం, బట్టలకు ఖర్చులు పోగా తక్కిన సొమ్మంతా భద్రపరచి కరోనా నివారణ సాయానికి అందిస్తున్నాడు. అంతేకాదు మిగిలిన సొమ్మును పేద విద్యార్థుల చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారు. పూలపాండ్యన్ దాతృత్వాన్ని తమిళవాసులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read Also…  దేశంలో కోవిద్ వైరస్ నిర్మూలన ఎప్పుడు..? ఇన్ ఫ్లుయెంజాలా మారుతుందా..? ఏటా వ్యాక్సినేషన్ తప్పదా ?