Compulsory Voting Countries: ఓటు హక్కు వినియోగించుకోకుంటే కఠిన శిక్షలు..  ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలకు అనర్హులు

|

Nov 30, 2023 | 8:57 AM

మనదేశంలో ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ఓటర్ల వ్యక్తిగత ఛాయిస్‌ మాత్రమే తప్పనిసరి కాదనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం స్పష్టం చేశాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం ఓటు వేయకుంటే నేరంగా భావించి కఠినమైన శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్బాల్లో భారీ మొత్తంలో జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఆయా దేశాలు 18 సంవత్సరాల వయస్సు నిండిన పౌరులు తప్పనిసరిగా ఓటు వేయడాన్ని..

Compulsory Voting Countries: ఓటు హక్కు వినియోగించుకోకుంటే కఠిన శిక్షలు..  ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలకు అనర్హులు
Compulsory Voting Countries
Follow us on

మనదేశంలో ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ఓటర్ల వ్యక్తిగత ఛాయిస్‌ మాత్రమే తప్పనిసరి కాదనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం స్పష్టం చేశాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం ఓటు వేయకుంటే నేరంగా భావించి కఠినమైన శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్బాల్లో భారీ మొత్తంలో జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఆయా దేశాలు 18 సంవత్సరాల వయస్సు నిండిన పౌరులు తప్పనిసరిగా ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లో వరకు లాటిన్‌ అమెరికాలోనే ఉన్నాయి. అయితే 65 ఏళ్లు నిండిన పౌరులకు మాత్రం తప్పనిసరి ఓటింగ్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ దేశాల్లో ఎన్నికలు జరిగే రోజున ఓటు వేయడం ఓటరు ప్రథమ కర్తవ్యం.

లెబనాన్, సింగపూర్ దేశాల్లో ఓటు హక్కు పొందే వయసు 21 ఏళ్లు. నౌరులో 20 యేళ్లు వస్తేగానీ ఓటు హక్కురాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఓటు హక్కు పొందేందుకు కనీస వయసు 18 యేళ్లుగా కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఓటు వేయని వారికి ఆ దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్ల జరిమానా విధిస్తారు. దాన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లించకపోతే 200 డాలర్ల వరకు అదనపు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బొలీవియా, బ్రెజిల్, కాంగో, కోస్టా రికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఈజిప్ట్, గ్రీస్, హోండురాస్, లెబనాన్, లక్సెంబర్గ్, మెక్సికో, నౌరు, పనామా, పరాగ్వే, పెరూ, సింగపూర్, థాయిలాండ్, ఉరుగ్వే.. ఈ 22 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి.

బెల్జియంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోల వరకు, రెండోసారి ఓటు వేయనివారికి 200 యూరోల వరకు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకుంటే జైలు శిక్ష విధిస్తారు. బెల్జియంలో వరుసగా నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోని పక్షంలో జైలు శిక్ష విధిస్తారు. సింగపూర్‌లో ఓటు వేయకుంటే ఓటరు పేరును పదేళ్ల వరకు జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. దీనికితోడు ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వరు. తిరిగి ఓటరు పేరు నమోదు చేయాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఓటు వేయనివారు బ్రెజిల్‌లోనూ ఫైన్‌ కట్టాలి. గ్రీసు, ఈజిప్టు దేశాల్లో ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయని వారికి జైలుశిక్ష విధిస్తారు. పెరూలో ఓటు వేయని వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తారు. ఇలా… ఓటు వేయనివారికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన శిక్షలు విధిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అత్యధిక ఓటు శాతం నమదైన దేశాలుగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రేలియాలో 90.98 శాతంగా మొదటి స్థానంలో ఉంది. బెల్జియంలో 89.37 శాతం, డెన్మార్క్‌లో 85.89 శాతం, స్వీడన్‌లో 85.81 శాతం, నెదర్లాండ్స్‌లో 81.93శాతంగా ఓటింగ్‌ నమోదవుతుంది. నిర్భంద ఓటింగ్‌ లేని దేశాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2013లో చిలీ దేశంలో అత్యల్పంగా 42 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.