పాత నగలు కొత్తవిగా మెరవాలంటే.. ఇవి ట్రై చేయండి..పైసా ఖర్చు లేకుండా పని సులువు..!

పండుగలు, పెళ్లిళ్లు వంటి సందర్భాల్లో బంగారం, వెండి నగలు, వస్తువులకు మెరుగులు పెట్టించే పని చేస్తుంటారు చాలా మంది. కానీ, ఇంట్లోనే నిమిషాల్లో మీ బంగారు, వెండి ఆభరణాలను తిరిగి మెరిసేలా చేసుకోవచ్చునని తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అవును, ఇకపై మీరు స్వర్ణకారుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేకుండానే మీ బంగారు నగలను తిరిగి కొత్తవిగా, మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

పాత నగలు కొత్తవిగా మెరవాలంటే.. ఇవి ట్రై చేయండి..పైసా ఖర్చు లేకుండా పని సులువు..!
Gold Cleaning Tips

Updated on: Jan 27, 2026 | 6:50 PM

బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలనే ఆశలు చంపేసుకుంటున్నారు. ఇకపోతే, కాస్త కూస్తో బంగారం ఉన్నవారు.. వాటిని భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న బంగారం పాతబడి పోవటం, ఒక్కోసారి నల్లగా మారిపోవటం జరుగుతుంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి సందర్భాల్లో బంగారం, వెండి నగలు, వస్తువులకు మెరుగులు పెట్టించే పని చేస్తుంటారు చాలా మంది. కానీ, ఇంట్లోనే నిమిషాల్లో మీ బంగారు, వెండి ఆభరణాలను తిరిగి మెరిసేలా చేసుకోవచ్చునని తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అవును, ఇకపై మీరు స్వర్ణకారుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేకుండానే మీ బంగారు నగలను తిరిగి కొత్తవిగా, మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

చాలా పాత ఆభరణాలు, రోజూ వారి ఉపయోగంలో ఉన్న నగలపై మురికి పేరుకుపోతుంది. దాని మెరుపు కూడా మసకబారుతుంది.అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ నగలను శుభ్రం చేసుకోవడానికి తరచుగా స్వర్ణకారుల వద్దకు వెళతారు. కానీ, ఇంట్లోని వస్తువులను ఉపయోగించి నిమిషాల్లో మీ నగలను శుభ్రం చేసుకునే ఉపాయం ఉంది. ఇందుకోసం ఒక పాన్ లో కొంచెం నీరు పోసి స్టవ్ మీద వేడి చేయండి. నీళ్లు మరిగిన తర్వాత, 2 టీస్పూన్ల టీ ఆకులు వేయండి. టీ ఆకులను బాగా మరిగించిన తర్వాత మంటను ఆపివేసి వాటిని రెండు వేర్వేరు గిన్నెలలో వడకట్టుకోవాలి. ప్రతి గిన్నెకు 1 టీస్పూన్ బేకింగ్ సోడా, సర్ఫ్ పౌడర్ వేసుకోవాలి.

ఇప్పుడు, వెండి ఆభరణాలను ఒక గిన్నెలో ముంచి, బంగారు ఆభరణాలను మరొక గిన్నెలో మునిగేలా వేయండి. బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో ఒక టీస్పూన్ పసుపు పొడిని కలపండి. వాటిని 10-12 నిమిషాలు నాననివ్వండి. తరువాత వాటిని తీసివేసి టూత్ బ్రష్ తో సున్నితంగా శుభ్రం చేయండి. ఇది ఏదైనా మురికి ఉంటే తొలగిస్తుంది. ఇప్పుడు శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. మీ పాత బంగారు ఆభరణాలు తిరిగి కొత్త వాటిలా మెరిసిపోవడానికి ఈ ట్రిక్ భలేగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులకు మెరుగు పెట్టేందుకు మరో ఉపాయం కూడా ఉంది.. బంగారు, వెండి ఆభరణాలను శుభ్రం చేయాలనుకుంటే, మీరు ఉప్పు, నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి, ఉప్పు, నిమ్మరసం వేసి ఆ నీటితో ఆభరణాలు శుభ్రం చేయండి.

బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి లిక్విడ్ డిష్ సోప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని నీటితో కలిపి, ఆపై లిక్విడ్ డిష్ సోప్ వాడటం వల్ల ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.

వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయడానికి మీరు టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం, వజ్రపు ఉంగరం లేదా చెవిపోగులకు కొద్ది మొత్తంలో టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి, కొద్దిసేపు రుద్దండి. తర్వాత, శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇలా చేయటం వల్ల మీ విలువైన ఆభరణాలు ఎలాంటి ఖర్చు, నష్టం లేకుండా ఇంట్లోనే తిరిగి మెరిసేలా, కొత్తవిగా కనిపించేట్టు చేసుకోవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..