Chhattisgarh teenager: ఎడమ కాలుతో బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థి.. తల్లి బాధలు చూడలేక..!

|

Mar 20, 2023 | 12:54 PM

Chhattisgarh teenager: ఛత్తీస్‌గఢ్‌లోని 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాశాడు.

Chhattisgarh teenager: ఎడమ కాలుతో బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థి.. తల్లి బాధలు చూడలేక..!
Student
Follow us on

అంగవైకల్యం ఉన్న ఓ విద్యార్థి అనుకున్నది సాధించాడు. అత్యున్నత ఆశయం వైపు అడుగులు వేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాశాడు. సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ ప్రాంతానికి చెందిన మహేష్ సింగ్‌ది పేద వ్యవసాయ కుటుంబం. ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధితో కాళ్లు, చేతుల వైకల్యంతో బాధపడుతున్నాడు.

అయితే టీచర్ కావాలనే ఆకాంక్షను ఆ టీనేజర్‌ని ఆపలేదు. శారీరక వైకల్యం కారణంగా చేతులతో పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ విద్యార్థికి పరీక్ష రాసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక అనుమతిచ్చారు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మహేష్ ఎడమ కాలితో రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఒక్కో పరీక్ష కాలుతో రాస్తూ 12వ తరగతికి చేరుకున్నాడు. ఈ పరీక్షలో 70 – 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు మహేష్.

మహేష్ సింగ్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మహేష్ తల్లి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతోంది. అతనితో పాటు మరో ఇద్దరు సోదరీలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. పొలాల్లో పని చేసే తల్లి బాధలను గట్టేక్కించేందుకు శారీరకంగా కాకుండా విద్యా పరంగా ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్నాడు మహేష్. ఈ క్రమంలోనే చదువుపై దృష్టి సారించాడు. చదువుతో పాటు తల్లికి వ్యవసాయం చేస్తూ సాయం చేస్తున్నాడు. పొలాల్లో పని చేసే తల్లిని చూస్తుంటే.. జీవితంలో ఏదైనా చేయాలనుకున్నాని.. అందుకే కష్టపడి చదువుతున్నట్లు మహేష్ తెలిపారు. వీలైనంత త్వరగా హిందీ పాఠశాల ఉపాధ్యాయుడిని కావాలనుకుంటున్నానన్నారు మహేష్. అమ్మ వయసు 60 ఏళ్లు దాటిపోయింది, ఆమెకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాను. నా కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం నాకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నానని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..