AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda U Go: హోండా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 130 కిలోమీటర్లు తిరగొచ్చు.. ధర కేవలం..?

Honda U Go: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను

Honda U Go: హోండా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 130 కిలోమీటర్లు తిరగొచ్చు.. ధర కేవలం..?
Honda U Go Electric Scooter
uppula Raju
|

Updated on: Aug 23, 2021 | 1:12 PM

Share

Honda U Go: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ప్రారంభిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యు-గోని ఇటీవల విడుదల చేసింది. ఇది చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ దీని ధర 7499 యువాన్ (సుమారు రూ. 86,000). ఈ స్కూటర్‌ను చైనా అనుబంధ సంస్థ యువాంగ్ హోండా విడుదల చేసింది.

సిటీ రైడింగ్ కోసం డిజైన్ చేయబడిన ఈ తేలికపాటి ఈ-స్కూటర్లు రెండు వేరియంట్లలో వచ్చాయి. హోండా U GO ప్రామాణిక మోడల్ 1.2 kW నిరంతర రేటెడ్ హబ్ మోటార్‌తో వస్తుంది. ఇది 1.8 kW గరిష్ట శక్తిని ఉత్పత్తిని చేస్తుంది. ఈ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 53 కిమీ. తక్కువ స్పీడ్ మోడల్ గురించి మాట్లాడాలంటే ఇది 800 W నిరంతర హబ్ మోటార్‌తో 1.2 kW పవర్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిమీ. రెండు మోడళ్లలో 1.44 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి.

హోండా U-GO LCD స్క్రీన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్కూటర్ వేగం, పరిధి, ఛార్జింగ్, రైడింగ్ మోడ్ గురించి వినియోగదారులకు తెలియజేస్తుంది. స్కూటర్ ఫ్రంట్ ఆప్రాన్‌లో LED హెడ్‌లైట్‌ అమర్చారు. ప్రధాన క్లస్టర్ చుట్టూ LED DRL స్ట్రిప్ కూడా ఉంది. ఈ-స్కూటర్ 12-అంగుళాల ముందు మరియు 10-అంగుళాల వెనుక అల్లాయ్ వీల్స్‌తో పాటు 26 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రస్తుతం చైనీస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది దీని ధర 7,499 RMB ($ 1,150) నుంచి మొదలవుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 86,000.

హోండా యు-గోలో ప్రత్యేక ఫీచర్లు ఆప్రాన్‌లో ట్రిపుల్ బీమ్‌తో సన్నని LED హెడ్‌లైట్, ప్రధాన క్లస్టర్ వైపు ఒక LED DRL స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. దీని LCD పరికరం క్లస్టర్ పరిధి, బ్యాటరీ స్థితి, రైడింగ్ మోడ్, వేగం వంటి ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది. స్కూటర్ USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారంతో వస్తుంది. భారతదేశంలో స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది త్వరలో భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Zodiac Signs: ఈ రాశుల వారు ప్రేమ వివాహాన్ని ఇష్టపడరు..అలా అని ప్రేమ అంటే విముఖతా చూపించరు..ఆ రాశులు ఏవంటే..

Lockers: బ్యాంక్‌ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ

అమెరికాలో పెళ్లి.. ఇండియాలో విందు! ఆన్‌లైన్‌ పెళ్లి సందడి!వైరల్ అవుతున్న వీడియో..:NRI Marriage Viral Video.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ