Car Tips: కారు ఇంజిన్ ఓవర్ హీట్ ఎక్కుతోందని టెన్షన్ పడుతున్నారా.? ఇలా చేస్తే చాలు..
తరచుగా కారు ఇంజిన్ ఓవర్ హీట్ ఎక్కడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ తలెత్తే చాలు..
తరచుగా కారు ఇంజిన్ ఓవర్ హీట్ ఎక్కడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ తలెత్తే చాలు.. మైలేజ్ తగ్గడం, కారు ఇంజిన్ ఆగిపోతుండటం, పదే పదే ఇంజిన్ సౌండ్‌లో మార్పు రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మరి అసలు కారు ఇంజిన్ ఓవర్ హీట్ ఎక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
ఇదిలా ఉంటే.. కారు ఇంజిన్ ఓవర్ హీట్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, మీరు చాలా వేడి ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కారును నడుపుతుంటే.. ఇంజిన్ ఓవర్ హీట్ ఎక్కడం ఖాయం. ఇక రెండోది.. మీరు ఎక్కువసేపు కారును నిరంతరంగా నడపడం వల్ల ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. ఈ రెండు కారణాలతో మీ కారు ఇంజిన్ హీట్ ఎక్కినట్లయితే.. మొదటిగా కారును కొంత సమయం వరకు ఓ చల్లటి ప్రదేశంలో పార్క్ చేయాలి. అలాగే కారు ఇంజిన్ నడుస్తున్నప్పుడు రేడియేటర్ క్యాప్‌ను అస్సలు తెరవకూడదు. ఎందుకంటే ఇంజిన్ కూల్ చేయడంలో రేడియటర్ కీలక పాత్ర పోషిస్తుంది. రేడియేటర్‌లో శీతలకరణి నిండి ఉంటుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూలెంట్ కూడా చాలా వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రేడియేటర్ క్యాప్‌ను తెరిస్తే, అప్పుడు ఈ శీతలకరణి(Coolant) మీపై పడి చర్మాన్ని కాల్చే అవకాశం ఉంది.
మొదటిగా కూలెంట్ లీకేజీని తనిఖీ చేయండి..
కారులోని అన్ని భాగాలు బాగానే ఉన్నా, కొన్నిసార్లు కారు ఓవర్ హీట్ అవ్వొచ్చు, ఈ సమయంలో కారు కూలెంట్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల అప్పుడప్పుడూ కారు ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. ఒకవేళ కారులో శీతలకరణి కూడా సరిగ్గా పనిచేస్తుంటే, కారు రేడియేటర్‌లో లీకేజీ ఉండే అవకాశం ఉంటుంది, దీని కోసం కారు కింద ఒకసారి తనిఖీ చేయండి. ఒకవేళ అదే జరిగితే.. దగ్గరలోని మెకానిక్‌ను సంప్రదించండి.