ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఖర్చు పెట్టి నిర్మించిన ఇంటిని అయినా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇక వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం లేకపోతే పలు రకాల సమస్యలు ఎదుర్కొంటారని వాస్తు పండితులు హెచ్చరిస్తూనే ఉంటారు.
అయితే ఎంత మంది వాస్తు పండితుల సలహాలు తీసుకొని నిర్మించిన ఇంట్లో అయినా, తెలిసీ తెలియక కొన్ని వాస్తు లోపాలు ఉంటాయి. ఇంట్లో ఉండే వాస్తు లోపాలు ఇంట్లోని కుటుంబ సభ్యులపై దుష్ప్రభావం చూపుతాయని చెబుతుంటారు. అయితే ఇంట్లో ఎలాంటి వాస్తు లోపాలు ఉన్నా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పరిహారం జరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో తెలిసీతెలియక ఉండే వాస్తు దోషాలకు చెక్ పెట్టేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్ వాస్తు టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు దోషాలకు చెక్ పెట్టేందుకు కర్పూరం బెస్ట్ ఆప్షన్‌గా వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న అన్ని గదుల మూలల్లో కర్పూరాన్ని ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా పెట్టిన కర్పూరం కొన్ని రోజులకు కరిగిపోతుంది, అయితే ఆ స్థానంలో మరొక కర్పూరాన్ని మారుస్తూ ఉండాలని చెబుతున్నారు. అలాగే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక డబ్బాలో కర్పూరాన్ని, లవంగాన్ని కలిపి కాల్చాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇక స్నానం చేసే సమయంలో నీటిలో కొన్ని చుక్కలు కర్పూరపు నూనెను కలిపి స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం ఉత్తేజవంతంగా అవుతుంది. అలాగే ఇంట్లో కర్పూరాన్ని ఉదయం, రాత్రి కాల్చితే ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం వల్ల సిరిసంపదలు సిద్ధిస్తాయని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..