AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Stove: ఇంట్లో మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉండవచ్చా..?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మూడు లేదా నాలుగు బర్నర్ గ్యాస్ స్టౌవ్‌లు ఎక్కువగా వాడుతున్నారు. ఇవి సమయం ఆదా చేయడంలో ఎంతో ఉపయోగకరంగా మారాయి. అందుకే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్టౌవ్‌ల డిమాండ్ పెరుగుతోంది. కానీ కొందరు ఈ గ్యాస్ స్టౌవ్ లను వాడకూడదని చెబుతుంటారు.

Gas Stove: ఇంట్లో మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉండవచ్చా..?
Gas Stove
Prashanthi V
|

Updated on: Jan 26, 2025 | 1:03 PM

Share

ప్రస్తుత కాలంలో కొందరి ఇళ్లలో మూడు లేదా నాలుగు బర్నర్ ల గ్యాస్ స్టౌవ్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా రెండు బర్నర్ ల గ్యాస్ స్టౌవ్ లను మాత్రమే వాడుకునేవారు. కానీ ఇప్పుడు మూడు బర్నర్ గ్యాస్ స్టౌవ్ లను ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు మూడు బర్నర్ ల గ్యాస్ స్టౌవ్ వాడకూడదని అంటుంటారు.

ఈ రోజుల్లో అందరూ బిజీ జీవితం గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనుల్లో లీనమై ఉంటున్నారు. ఇలాంటప్పుడు రెండు బర్నర్ లు ఉండే స్టౌవ్ సరిపోవడం చాలా కష్టమవుతోంది. ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉండే దంపతులు, పిల్లల స్కూల్ టైమింగ్స్, ఆఫీస్ పనులు.. ఈ అన్నింటిని మేనేజ్ చేయడంలో మూడు లేదా నాలుగు బర్నర్ ల గ్యాస్ స్టౌవ్‌లు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అందుకే ఇప్పటి పరిస్థితులకు తగినట్లు ఈ స్టౌవ్‌లు డిమాండ్ లో ఉన్నాయి.

పాతకాల వాస్తవాలు

పూర్వకాలంలో కుటుంబాలు ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీగా ఉండేవి. కిచెన్ లు చాలా చిన్నగా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు కంటే ఎక్కువ బర్నర్ స్టౌవ్ పెట్టడం సాధ్యం కాకపోవడంతో పాటు, ప్రమాదాలకు అవకాశం ఉండేది. కాబట్టి అప్పట్లో పెద్దవాళ్లు రెండు స్టౌవ్ లు మాత్రమే వాడమని సూచించేవారు.

కిచెన్ లో మార్పులు

పాత రోజుల్లో వంట కోసం కిచెన్ లో ఒక స్టౌవ్ మాత్రమే ఉండేది. వేడి నీటికి వేరే స్టౌవ్ ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ ఒకే వంటగదిలోనే చేయాల్సి వస్తోంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వంట.. ఇవన్నీ వేగంగా పూర్తవ్వాలి. అందుకే రెండు బర్నర్ లు చాలక, మూడు లేదా నాలుగు బర్నర్ లు ఉపయోగించడం సాధారణంగా మారింది.

వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

మూడు బర్నర్ ల గ్యాస్ స్టౌవ్ వల్ల వాస్తు ప్రకారం ఎలాంటి దోషం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మన జీవితాన్ని అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. పాతకాలంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు వర్తించవు. కాబట్టి ఈ బర్నర్ స్టౌవ్‌లను ఉపయోగించడం వల్ల ఎలాంటి అపశృతి ఉండదని సూచిస్తున్నారు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)