ముల్లంగి గురించి మీకు తెలియని విషయాలు..! కరోనా టైంలో కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..

|

Apr 30, 2021 | 1:05 PM

Benefits of Radish : ముల్లంగి రూట్ వేజిటేబుల్. ఇది భూమిలో పండుతుంది అందుకే దీన్ని రూట్ వెజిటేబుల్ అంటారు. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో

ముల్లంగి గురించి మీకు తెలియని విషయాలు..! కరోనా టైంలో కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..
Benefits Of Radish
Follow us on

Benefits of Radish : ముల్లంగి రూట్ వేజిటేబుల్. ఇది భూమిలో పండుతుంది అందుకే దీన్ని రూట్ వెజిటేబుల్ అంటారు. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. ఇది మంచి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. ఎందుకంటే దీని గురించి సరైన అవగాహన లేకపోవడమే. నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది.

ముల్లంగిలో శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయంను మంచి కండీషన్‌లో ఉంచుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగి ఆకులు కామెర్ల నివారణకు ఉపయోగపడుతాయి. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగి కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరిగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచకుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.

ముల్లంగి మాత్రమే కాదు వాటి ఆకులు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటి రుచి బాగుంటుంది కూడా. ముల్లంగి ఆకుతో కూర చేసుకుంటే భలే వెరైటీగా ఉంటుంది. ఈ ఆకు రసాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముల్లంగితో ఒనగూరే ప్రయోజనాలన్నీ వాటి ఆకులతో కూడా వస్తాయి. కామెర్ల నివారణకు ఈ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముల్లంగి, వాటి ఆకులే కాదు రసం కూడా మంచిది. తాజా ముల్లంగి రసం తీసి అందులోకి నాలుగు చుక్కల నిమ్మరసం కావాలంటే చిటికెడు మిరియాల పొడి వేసుకుని జ్యూస్ ట్రై చేయండి. మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.

అధిక రక్తపోటు తో బాధ పడే వారికి ఇది దివ్యౌషధం అనే చెప్పొచ్చు. ముల్లంగి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బి6 , పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో ఉంటాయి. దీనితో ఇది రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు. పురుషుల్లో సంతానోత్పత్తికి ముల్లంగి సహకరిస్తుంది. అందుకే ఇది సూపర్ ఫుడ్ గా పేరుగాంచింది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని రోజూ తిన్నారనుకోండి అతిసారం వంటివి మిమ్మల్ని బాధిస్తాయి కనుక అతిగా తినకండి.

Tihar Jail: కరోనా సెకండ్ వేవ్.. తీహార్ జైల్లో నలుగురు ఖైదీల మృతి.. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల లేఖ

NHAI Recruitment 2021: గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..