Beggar: అతనో బిచ్చగాడు.. నెల అద్దె అక్షరాలా 1.27 లక్షలు.. మొత్తం ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

అతనో బిచ్చగాడు.. వీధుల వెంట తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తాడు. బిచ్చమెత్తుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో తన రోజును గడుపుతాడు.

Beggar: అతనో బిచ్చగాడు.. నెల అద్దె అక్షరాలా 1.27 లక్షలు.. మొత్తం ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..
Beggar
Follow us

|

Updated on: Dec 02, 2022 | 8:37 PM

అతనో బిచ్చగాడు.. వీధుల వెంట తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తాడు. బిచ్చమెత్తుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో తన రోజును గడుపుతాడు. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అతనికి మరో వైపు కూడా ఉంది. అవును, అతను కోటీశ్వరుడైన బిచ్చగాడు. అతని ఆస్తి అక్షరాలా రూ. 5 కోట్ల పైనే ఉంటుంది. అంతేకాదండోయ్.. భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా.. అతని ఇంటి అద్దె రూపంలో నెలకు రూ. 1.27 లక్షల ఆదాయం వస్తుంది. ఇక వీధుల్లో అడుక్కుంటూ రోజు 200 నుంచి 300 బ్రిటన్ ఫౌండ్స్ సంపాదిస్తున్నాడు. ఈ రిచ్చెస్ట్ బిచ్చగాడి కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

ఈ రిచ్చెస్ట్ బిచ్చగాడిది లండన్. అక్కడి వీధుల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఒకప్పుడు మంచోడే కాదే.. అతనికున్న దురలవాట్లే అతన్ని ఈ పరిస్థితి దిగజార్చాయి. మద్యం, డ్రగ్స్‌కు బానిస అయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. లండన్‌కు చెందిన డోమ్.. అక్కడి మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో అతని గురించి తెలుసుకుని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి షాక్ అయ్యారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డోమ్ చిన్న వయసులోనే డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. కానీ, అతనిలో ఓ క్రీడాకారుడు ఉన్నాడు. అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యం కారణంగా అతనికి స్కాలర్‌షిప్ వచ్చేది. అయితే, డోమ్ కౌమార దశలో ఆల్కాహాల్, డ్రగ్స్ మొదలైన వ్యసనాలకు బానిస అయ్యాడు. 13 సంవత్సరాల వయసులోనే గంజాయిని సేవించేవాడు. 18 సంవత్సరాల వయసు నాటికి హెరాయిన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అయితే, పరిస్థితి దిగజారడంతో.. ఏడేళ్లపాటు డీఅడిక్షన్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉన్నాడు.

అయితే, డోమ్ మళ్లీ మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో.. రోడ్డున పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ అతన్ని చేరదీయడం లేదు. లండన్ వీధుల్లో అడుక్కుంటూ ప్రతి రోజూ 200 నుంచి 300 ఫౌండ్లు సంపాదిస్తున్నాడు. తనకు వచ్చిన డబ్బులో చాలా వరకు డ్రగ్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు డోమ్ తెలిపాడు. రోడ్డు పక్కన షెల్టర్లలో పడుకుంటూ రోజులు గడుపుతున్నాడు డోమ్. అంతకు ముందు ఇంట్లో ఉన్న డోమ్.. డ్రగ్స్ మానేస్తానంటూ ఇంటి అద్దె రూపంలో వచ్చే డబ్బునంతా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ కోసం ఖర్చు చేసేవాడట. అలా కుటంబ సభ్యులు, స్నేహితులు సైతం అతన్ని దూరం పెట్టారు.

ఇవి కూడా చదవండి

మార్పుకోసం తహతహ..

అయితే, డోమ్ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ చెడు వ్యసనాలను వదిలేయాలని గట్టి ప్రయత్నాలే సాగిస్తున్నాడు. ఇందుకోసం ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తానని చెబుతున్నాడు. మరి డోమ్ మారుతాడా? మాదకద్రవ్యాలను వదులుతాడా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. కానీ, మనం కూడా అతను మారాలని, సహజ జీవితం కొనసాగించాలని ఆకాంక్షిద్దాం.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో