Parenting Tips: పిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారా.. అస్సలు చేయకండి.. చాలా ప్రమాదమే!!

|

Jul 29, 2023 | 7:18 PM

పిల్లల పెంపకం అనేది ఓ పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ గారాబం చేసినా ప్రమాదమే.. అలాగని కఠినంగా ఉన్నా డేంజరే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ కొనిచ్చేస్తారు. వాళ్లు బాధపడుకుండా చూసుకుంటారు. ఇది చాలా తప్పు అంటున్నారు నిపుణులు. మీరు ఒక వస్తువు వారికి ఇస్తున్నారంటే....

Parenting Tips: పిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారా.. అస్సలు చేయకండి.. చాలా ప్రమాదమే!!
Parenting Tips
Follow us on

పిల్లల పెంపకం అనేది ఓ పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ గారాబం చేసినా ప్రమాదమే.. అలాగని కఠినంగా ఉన్నా డేంజరే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ కొనిచ్చేస్తారు. వాళ్లు బాధపడుకుండా చూసుకుంటారు. ఇది చాలా తప్పు అంటున్నారు నిపుణులు. మీరు ఒక వస్తువు వారికి ఇస్తున్నారంటే.. దాని వెనుక ఎంత కష్టపడ్డారనేది వాళ్లికి తెలియాలి. సానుకూల పెంపకమే పిల్లల ఎదుగుదలకు, వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు. మరి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వేచ్ఛ ఇవ్వడం:

కొంతమంది పేరెంట్స్.. పిల్లలకు ఎక్కువగా స్వేచ్ఛని ఇస్తూంటారు. పిల్లలు కోరుకున్నవి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటారు. పిల్లల ప్రవర్తనలో చెడు కనిపించినా అడ్డు చెప్పరు. క్రమశిక్షణ, నియమాలు లేకుండా పెంచుతుంటారు. ఇలా పెరిగిన పిల్లల్లో ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దూకుడు స్వభావం అలవాటవుతుంది. దీంతో ఏదైనా వాళ్లకు ఈజీగా కావాలని.. చెడు దారులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

కఠినంగా వ్యవహరించడం:

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలపై అధికారం చెలాయిస్తూ ఉంటారు. పిల్లలు పొరపాట్లు చేస్తే కొడుతూ, తిడుతూ ఉంటారు. పేరెంట్స్‌ ను చూస్తేనే భయపడిపోయేలా చేస్తూ ఉంటారు. వారిపై కఠినంగా ఉంటూ, వాళ్లు పెట్టిన రూల్స్‌ కచ్చితంగా ఫాలో అవ్వాలని ఆర్డర్లు వేస్తారు. పిల్లలతో కఠినంగా ప్రవర్థిస్తే.. వారిలో ఆత్మవిశ్వాం కొరవడుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి, భయం ఎక్కువగా పెరుగుతాయి.

పేరెంట్స్ ఇష్టాలను పిల్లలపై రుద్దడం:

చాలా మంది తల్లిదండ్రులు వారు చిన్నప్పుడు చేయ్యలేని చదువు, డ్యాన్స్ లాంటివి ఏమైనా ఉంటే.. వాటిని పిల్లలపై రుద్దాలని చూస్తూంటారు. వాళ్లకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించాలని చూస్తారు. దీంతో వారు సంబంధించిన విషయంపై ఏకాగ్రతతో ఉండలేరు. లోలోపల సతమతం అవుతూంటారు. ముందుగా పిల్లల ఇష్టాలను అడగాలి. అందులో ఏమైనా లోపాలు ఉంటే కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి.

ఇతర పిల్లలతో పోల్చడం:

పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చకూడదు. ఒక్కొక్కరి శరీర, మానసిక తత్త్వాన్ని బట్టి పిల్లలు ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం. కాబట్టి వారి ఇష్టాలను ఏంటో తెలుసుకోవాలని కానీ.. వేరే పిల్లలతో అస్సలు పోల్చకూడదు. అలా పోలిస్తే ఆ మాటలు వారి మెదడులో బలంగా నాటుకుంటాయి. పిల్లలతో మట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..