Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!

Astrology: వీరు సాధారణంగా గొడవలకు దూరంగా ఉంటారు. లేనిపోని గొడవలకు పోకుండా శాంతంగా ఉంటారట. అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం ఉంటుంది. వీరు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకుంటారు. వీరికి అందమైన వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే..

Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!

Updated on: Oct 11, 2025 | 5:07 PM

Astrology: కొందరిని చూడగానే వెంటనే నచ్చేస్తారు. కారణం వారి రూపు రేఖలు, వారి మనస్థత్వం, వారి నడవడిక ఇలా వారి అలవాట్లు మనల్ని ఆకట్టుకునేలా చేస్తాయి. అందంగా ఉన్నవాళ్లు ఎవరికి నచ్చకుండా ఉంటారు చెప్పండి. అయితే ప్రతి ఒక్కరూ అందరిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందంగా కనిపించేందుకు రకరకాల మేకప్‌ క్రిములను వాడుతుంటారు. అందంగా డ్రెస్సింగ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ కొంతమంది ఏ మేకప్ వేసుకోకున్నా.. పెద్దగా రెడీ కాకున్నా అందంగానే కనిపిస్తుంటారు.

అయితే వీరికున్న అందమైన సహజ రూపురేఖలే ఇందుకు కారణం అనే చెప్పాలి. కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన మహిళలు సహజంగానే అందమైన రూపురేఖలతో జన్మిస్తారట జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. వీరిని చూడగానే నచ్చేస్తారట. ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారో తెలుసుకుందాం..

జూన్ నెలలో..

జ్యోతిష్యం ప్రకారం.. జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారట. అంతేకాదు వీరి మనస్సు కూడా చాలా మందిదట. వీరి ప్రవర్తన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని శాస్తరం చెబుతోంది. వీరికి సహజంగానే అందమైన రూపు రేఖలు ఉంటాయి. వీళ్లు మెరిసే చర్మాన్ని, ఆకర్షణీయమైన పెదవులను, ప్రకాశవంతమైన కళ్లను, దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారట. అందుకే ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు త్వరగా ఆకర్షిస్తారు.

ఇవి కూడా చదవండి

వీళ్లు ప్రశాంతంగా ఉంటారు.. బుద్దిమంతులు:

ఈ నెలలో పుట్టిన వీళ్లు అందంగా రెడీ అయ్యేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గరట. వీళ్లు ప్రశాంతంగా ఉంటారట. అంతేకాదండోయ్‌ బుద్దిమంతులు కూడా. ఏ విషయంలోనైనా చురుకుగా ఉండటం, తెవివిగా ఆలోచిస్తారట. అంతేకాదు వీరికి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉంటారట. వీళ్లు చూడగానే ఇతరులు త్వరగా ఫ్రెండ్‌షిప్‌ చేసేస్తారట.

ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలకు ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుందట. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా ప్రశాంతంగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. వీరి ఆలోచన విధానానలు ఎవ్వరు కూడా గెస్‌ చేయ్యలేరని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు.అందంగా ఉంటారు. వీరి అందాన్ని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. అలా వీరు చాలా ధైర్యవంతులు కూడాను.

వీరికి మంచి నాయకత్వ లక్షణాలు:

అలాగే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలోనైనా నాయకత్వం తీసుకోవాలనుకుంటారు. వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కడా గౌరవం తగ్గాలని భావించరు. ఎక్కడైనా గౌరవ తగ్గినట్లు అనిపిస్తే జీర్ణించుకోలేరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు ఫ్యాషన్, అందం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

అక్టోబర్‌లో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారంటే..

అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి గుణవంతులని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. వీరు అందంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారిని శుక్రుడు పాలిస్తాడు. ఈ నెలలో జన్మించిన అమ్మాయిలు మంచి నడవడిక ఉంటుందట. ఇతరులను ఆకర్షించే గుణం ఉంటుంది. వీరి అందానికి ఎదుటివారు ముగ్ధులైపోతారు. అందుకే వీరు వెళ్లిన ప్రతి చోటా ప్రత్యేకంగానే కనిపిస్తారు.

గొడవలకు దూరంగా ఉంటారు:

వీరు సాధారణంగా గొడవలకు దూరంగా ఉంటారు. లేనిపోని గొడవలకు పోకుండా శాంతంగా ఉంటారట. అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం ఉంటుంది. వీరు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకుంటారు. వీరికి అందమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరులకంటే వీరు ఎక్కువ గౌరవం పొందుతారు. వీరి విషయాలను ఎవ్వరికి చెప్పరు. వీరికి సంబంధించిన విషయాలు దాచిపెడతారు. పైన ప్రశాంతంగా కనిపిస్తారు. పర్సల్‌ విషయాలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరితో ఎంత క్లోజ్‌గా ఉన్నా వారి విషయాలను ఎప్పుడు చెప్పేందుకు ఇష్టపడరట.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి