ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పింది చాలాసార్లు వాస్తవ రూపం దాల్చడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి తన భార్య వీణా శ్రీవాణి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పంచుకున్నారు. ‘ మా ఆవిడ గత పదేళ్ల నుంచి అత్యాచారానికి గురైన మహిళలకు తనవంతూ సేవ చేస్తోంది. అత్యాచారానికి గురైన మహిళలు మానసికంగా డిస్టర్బ్ అయ్యి లైఫ్ నాశనం చేసుకుంటారని గ్రహించిన నా భార్య ప్రతి నెలా వారి దగ్గరకు వెళుతుంది. వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చుతుంది. ఈ ఐడియా నా భార్యదే. నా వంతు సహాయం నేను చేస్తుంటాను. మేం వారిని దత్తత తీసుకున్నాం’ అని తన సతీమణి చేస్తోన్న సేవా కార్యక్రమాలను షేర్ చేసుకున్నారు వేణు స్వామి.
కాగా వేణుస్వామి- వీణా శ్రీవాణి లది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని వేణుస్వామినే పలుసార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన సతీమణిపై ప్రేమను కూడా కురిపించారు. ‘నా దగ్గర ఏమీ లేనప్పడు నమ్మి నాతో వచ్చింది మా భార్య. ఆమెను ఎప్పటికీ దేవతలా చూసుకుంటాను’ అని ఒక సందర్భంలో భార్యపై తనుకున్న ప్రేమను చాటుకున్నారు వేణుస్వామి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..