ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ తన ఔదార్యంను చాటుకున్నారు. అనంతపురం జిల్లా, గుత్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న మారుతీ ప్రసాద్ ఓ అభాగ్యురాలి పట్ల దాతృత్వం చాటుకున్నారు. ఆయన చేసిన పనికి ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఏకంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈయన చూపిన దాతృత్వానికి ఫిదా అయిపోయారు. పోలీస్ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియోను షేర్ చేయగా ప్రజలంతా కానిస్టేబుల్ మారుతీ ప్రసాద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రోజు మాదిరిగానే డ్యూటీకి వెళుతున్న మారుతీ ప్రసాద్ కు రోడ్డు మీద చలికి వణుకుతూ ఓ అభాగ్యురాలు కనిపించింది. చలించిపోయిన కానిస్టేబుల్ తన జాకెట్ ని విప్పి ఆమెకు తొడిగాడు. తర్వాత ఆమెను అనంతపురంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మానవత్వం ప్రదర్శించిన కానిస్టేబుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
DGP Gautam Sawang appreciates the humanity gesture exhibited by Maruti Prasad,Police Constable of Gooty PS #Anantapur District when an old woman is suffering with winter on a high way road,he has given his jacket and extended a helping hand financially&joined her in an orphanage. pic.twitter.com/criqZKaYAH
— Andhra Pradesh Police (@APPOLICE100) November 26, 2021
అదే విధంగా పెడన పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మానసిక విగలాంగురాలైన మహిళకు ఆహారం తినిపించి తన మంచి మనసు చాటుకున్నారు.
#APPolice affection&solitude towards a mentally ill old woman :
With an information when a mentally ill old woman roaming on streets at Bantumilli area,B.Srinivasa Rao,Head Constable of #Pedana PS approached her, provided clothes & fed her with his own hands. pic.twitter.com/cJbYJ4DbFl— Andhra Pradesh Police (@APPOLICE100) November 25, 2021
Also Read: అధిక వడ్డీ ఆశ.. కి’లేడీ’ ట్రాప్‌లో సినిమా స్టార్స్
Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు.