Spinach Farming: రైతుల అదృష్టాన్ని మారుస్తున్న పాలకూర సాగు.. లక్షల్లో సంపాదన.. పూర్తి వివరాలు మీకోసం

|

Aug 27, 2022 | 7:06 PM

అత్యాధునిక మెళకువలతో సాగు చేస్తున్న వ్యవసాయం వల్ల చాలా లాభాలు వస్తున్నాయన్నారు. ఇప్పుడు సమీపంలోని రైతులు కూడా తమ పాలకూర పంటను చూసి పాల కూర చేస్తున్నారని రైతు తెలిపారు.

Spinach Farming: రైతుల అదృష్టాన్ని మారుస్తున్న పాలకూర సాగు.. లక్షల్లో సంపాదన.. పూర్తి వివరాలు మీకోసం
Spinach Farming
Follow us on

Spinach Farming: వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనిపించాలంటే.. రైతులు విభిన్న వ్యవసాయ పద్దతులను పాటించాల్సి ఉంది. అంతేకాదు.. మూస పద్ధతిలో కాకుండా ఈజీగా లాభాలను తెచ్చిపెట్టే పంటలను పండించాల్సి ఉంది.  తాజాగా పాలకూర సాగుతో రైతులకు ఆర్థిక ప్రగతికి దారులు తెరుచుకుంటున్నాయి . దీని సాగు ద్వారా రైతులు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్‌లోని  ఓ రైతు.. తన తండ్రి కాలం నుండి వస్తున్న సాంప్రదాయ వ్యవసాయాన్ని చేయడం మొదలు పెట్టాడు. అయితే వ్యవసాయంతో తమ అవసరాలకు తీరి.. లాభాలను ఆర్జించడం కష్టంగా మారింది. దీంతో లక్నోలో జరిగిన సెమినార్‌లో పాలకూర సాగు గురించి తెలుసుకున్నారు.

ఆ తర్వాత పాలకూర సాగు చేశాడు. గత 3 సంవత్సరాలుగా పాలకూర సాగు చేస్తున్నాడు. బచ్చలి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయకమైన పంటగా నిరూపిస్తూ పొలంలో పచ్చని పంటను చూసి రైతు హృదయం ఉప్పొంగుతోంది. రైతు ఆర్థిక స్థితిగతులు పటిష్టం కావడానికి ఇది వాణిజ్య పంట అని, నెలకు 3 సార్లు పంట పండుతుందని రైతు అన్నారు. పాలకూర పంట తన జేబుని నింపుతుందని.. డబ్బుకి లోటు అన్న మాట తనకు రాలేదని చెప్పారు.

పీఎం కిసాన్ యోజన ద్వారా వచ్చిన మొత్తంతో వ్యవసాయం:
సుమారు హెక్టారులో పాలకూర విత్తడంతో మంచి లాభం వస్తోందని రైతు తెలిపారు. జూన్‌ లో విత్తిన పాలకూర పంట ఏడోసారి కోతకు వచ్చినట్లు చెప్పారు. దాదాపు 50 క్వింటాళ్ల పాలకూర దిగుబడి వస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చిన మొత్తంతో తొలిసారిగా పాలకూర ఉత్పత్తి ప్రారంభించినట్లు రైతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమీప రైతులకు స్ఫూర్తి 
అత్యాధునిక మెళకువలతో సాగు చేస్తున్న వ్యవసాయం వల్ల చాలా లాభాలు వస్తున్నాయన్నారు. ఇప్పుడు సమీపంలోని రైతులు కూడా తమ పాలకూర పంటను చూసి పాల కూర చేస్తున్నారని రైతు తెలిపారు. పొలంలో సేంద్రియ ఎరువుల కొరత కూడా పాలకూర సాగు ద్వారా తొలగిపోతుంది. పాలకూర విత్తనాలను శుద్ధి చేసిన తర్వాత 1 అంగుళం కంటే ఎక్కువ లోతులో విత్తనాలు నాటాల్సి ఉంది. మొక్కల మధ్య దూరం 7 అంగుళాలు ఉండాలని ఉద్యావన అధికారి సూచించారు. విత్తనాలు విత్తిన వెంటనే పొలానికి సాయంత్రం పూట నీరు పెట్టాలి.

30 రోజుల్లో కోతకు సిద్ధం:
పాలకూరను జనవరి, జూన్, సెప్టెంబర్ అక్టోబరులో విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తిన పాలకూర మంచి దిగుబడిని ఇస్తుంది. ఒక హెక్టారులో సుమారు 30 నుండి 32 కిలోల విత్తనాలు నాటవచ్చు. 30 రోజులలో పాలకూర కోతకు సిద్ధంగా ఉంటుంది. పాలకూర సాగులో నత్రజని, భాస్వరం, పొటాష్‌ని ఉపయోగిస్తారు. డ్రిప్ పద్ధతిలో స్లర్రీని తయారు చేసి అవసరాన్ని బట్టి రైతులు పొలానికి ఎరువులు, నీరు ఇస్తున్నారు.

బచ్చలి కూర సాగుకు pH విలువ కలిగిన నేల
పాలకూర పంటకు చాలా ఉపయోగకరంగా ఉంటుది, ఎక్కువ నీరు అవసరం లేదు.  pH 7 ఉన్న నేల పాలకూర సాగుకు మంచిది.  పాలకూర మొక్క వేరు తగినంత లోతులో నాటాల్సి ఉంది. కనుక విత్తనాలు విత్తడానికి ముందు పొలాన్ని తయారు చేసే సమయంలో లోతుగా దున్ని..  మట్టిని సన్నగా చేసుకోవాలి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి