Vastu Tips: ఈ దిక్కున కూర్చొని భోజనం చేస్తున్నారా.? ఆయుష్షు తగ్గుతుంది జాగ్రత్త..
ఇలాంటి వాస్తు నియమాల్లో భోజనం చేసే విధానం కూడా ఒకటి. మనం ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తామో, అది మనపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రంలో ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిక్కులవైపు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తే...
వాస్తు అనగానే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం అనే భావనలో ఉంటాం. అయితే వాస్తు కేవలం నిర్మాణానికి మాత్రమే కాకుండా జీవన విధానంలోనూ ఓ భాగమేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జీవించే విధానంలోనూ వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి వాస్తు నియమాల్లో భోజనం చేసే విధానం కూడా ఒకటి. మనం ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తామో, అది మనపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రంలో ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిక్కులవైపు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణం అనేది యమస్థానం.. కాబట్టి ఈ దిక్కుగా కూర్చొని భోజనం చేస్తే, ఆయుష్షు తగ్గుతుంది. దురదృష్టం వెంటాడుతుంది.
* ఇక పశ్చిమం వైపు కూడా ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఈ దిశలో కూర్చొని భోజనం చేస్తే ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
* అలాగే పడమర వైపు కూడా కూర్చొని భోజనం చేయకూడదు. ఈ దిశగా కూర్చొని భోజనం చేస్తే అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇదిలా ఉంటే భోజనం చేయడానికి తూర్పు లేదా ఉత్తరం దిక్కుల కూర్చొని భోజనం చేయడం శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు దిశలను.. దేవతలు కొలువుండే దిక్కులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వైపు కూర్చొని భోజనం చేస్తే.. లక్ష్మీ కటాక్షం దొరుకుతందని, ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.
* ఇక వాస్తు శాస్త్ర ప్రకారం కాళ్లకు చెప్పులు ధరించి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంచంపై కూర్చొని భోజనం చేయొద్దు. లక్ష్మీదేవీకి కోపం తెప్పించినట్లువుతుందని వాస్తు పండితులు అభిప్రాయపడుతున్నారు.
* ఇటీవల స్నానం చేయకుండా కూడా భోజనం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా భోజనం చేయొద్దని చెబుతున్నారు.
* విరిగిన ప్లేట్‌లో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదని నిపుణులు చెబుఉన్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు పండితుల అభిప్రాయాలు, వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ఆధారంగా పేర్కొన్నవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..