Man Bring Snake to Hospital : ప్రతి సంవత్సరం పొలంలో పనిచేస్తున్నప్పుడు పాము కాటుకు గురై చాలామంది రైతులు మృతిచెందుతున్నారు. ఎందుకంటే వారు బురదలో ఉంటారు కనుక
పాము కరిచినప్పుడు స్పర్శ తెలియదు. దీంతో అలాగే పనిచేయడం వల్ల పాము విషం శరీరం మొత్తం పాకి చనిపోతున్నారు. అయితే పాము కాటును గుర్తించిన రైతులు మాత్రం ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది.
కంప్లి తాలూకా, ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప అనే యువకుడు పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పని చేస్తున్న జాడప్పను నాగుపాము కాటు వేసింది. అయితే కాడప్ప భయపడకుండా కాటు వేసిన పామును సజీవంగా పట్టుకుని మెట్రి గామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ లేకపోవడంతో స్నేహితుడి సహాయంతో వెంటనే కంప్లి ప్రభుత్వ అసుపత్రికి వెళ్లారు. అక్కడ యువకుడి చేతిలో పామును చూసిన డాక్టర్లు భయపడిపోయి బయటకు వెళ్లమన్నారు.. అనంతరం విషయం తెలుసుకుని కాడప్పకు ప్రథమ చికిత్స చేసి బాళ్లారి విమ్స్‌కు తరలించారు.