Viral: పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుత దృశ్యం.. చెట్టును నరికే కొద్దీ ఉబికి వస్తున్న నీరు..!
కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తరచూ అనేక వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరిగే వింత ఘటనలు, చిత్రవిచిత్రాలు మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తరచూ అనేక వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరిగే వింత ఘటనలు, చిత్రవిచిత్రాలు మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చెట్టును మొదలు నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది. ఈ వింత ఘటన అల్లూరి జిల్లా జిల్లాలో చోటు చేసుకుంది.
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో ఈ అద్భుతం వెలుగు చూసింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లారు అటవీ శాఖ అధికారులు. ఈ క్రమంలో నల్లమద్ది చెట్టు వద్దకు వచ్చిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ చెట్టు నుంచి నీరు చుక్కలు బయటకు వచ్చాయి. దీంతో వారు మరికాస్తా చెట్టు కాడను నరకగా.. అందులో నుంచి మంచినీళ్లు బయటకు ఉబికి వచ్చాయి. దీంతో అటవీ సిబ్బంది చెట్టు బెరుడును మొత్తంగా నరికేశారు. దీంతో చెట్టు నుండి వస్తున్న జలధార చూసిన అటవీ అధికారులు ఎంతో ఉత్సాహం వక్తం చేశారు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అటవీ సిబ్బంది తెలిపింది.
ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను ఇందుకూరు రేంజ్ అటవీ అధికారులు తాగారు. సాధారణం చెట్ల నుండి పాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల బెరడుల నుంచి పాలు రావడం సర్వసాధారణం. వాతావరణంలో మార్పులు, చెట్టు లక్షణాల కారణంగా ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న వింతలు మాత్రం శాస్త్రవేత్తలను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. ఇక అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలాధార వృక్షం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఈ వీడియో మీరూ చూసేయండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…