Govt.Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్.. కడుపులోని 7 కిలోల కణితి తొలగించిన డాక్టర్లు

| Edited By: Balaraju Goud

Jan 04, 2024 | 8:38 PM

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశారు. రామవరం కి చెందిన ఫాతిమాభి (90) కడుపు నొప్పితో బాధపడుతోంది. మూడు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాభి కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.

Govt.Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్.. కడుపులోని 7 కిలోల కణితి తొలగించిన డాక్టర్లు
Rare Surgery
Follow us on

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశారు. రామవరం కి చెందిన ఫాతిమాభి (90) కడుపు నొప్పితో బాధపడుతోంది. మూడు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాభి కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరారు. గత గురువారం ఆమెను వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో ఏడు కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు బుధవారం విజయవంతంగా ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణితి తొలగించారు..

గత మూడు నెలలుగా ఫాతిమాభి కడుపు నొప్పితో బాధపడుతోంది..ఆకలి తగ్గిపోవటం, బరువు కూడా బాగా తగ్గడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..డాక్టర్లు పరీక్షలు నిర్వహించి కణితి ఉందని, తొలగించక పోతే ప్రాణాలకు ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు వైద్యులు. ప్రభుత్వ డాక్టర్ల సూచనల మేరకు వెంటనే ఆపరేషన్ చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమార స్వామి పర్యవేక్షణలో వైద్యుల బృందం దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయ వంతంగా నిర్వహించి కణితి తొలగించారు. ప్రస్తుతం ఫాతిమాభి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు.

ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు సురేందర్, నాగమణి, స్రవంతి, కుమారి, టెక్నీషియల్ ఆదినారాయణ, కోటి, పవన్, హైమావతి, ప్రియ, పాల్గొన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేశారు..సర్జరీ చేసిన డాక్టర్ల బృందం ను ఉన్నతాధికారులు అభినందించారు

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…