Andhra Pradesh: మంచి నీళ్ల కోసం రైల్వేస్టేషన్‌లో దిగాడు.. ఏళ్లు గడిచిన దొరకని జాడ.. చివరికి..!

| Edited By: Balaraju Goud

Aug 07, 2024 | 3:08 PM

అది కుంచనపల్లి అండర్ పాస్.. అక్కడ డివైడర్‌పై ఒక వ్యక్తి దీనావస్థలో ఉంటున్నాడు. చుట్టుపక్కల వారు ఇచ్చింది, తినడం.. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అక్కడే నివాసం కొనసాగిస్తున్నాడు. మానసికంగా ఇబ్బంది పడుతున్నాడన్న ఉద్దేశంతో చిరు వ్యాపారులు తమకి తోచింది ఇస్తూ వస్తున్నారు.

Andhra Pradesh: మంచి నీళ్ల కోసం రైల్వేస్టేషన్‌లో దిగాడు.. ఏళ్లు గడిచిన దొరకని జాడ.. చివరికి..!
Humanity
Follow us on

అది కుంచనపల్లి అండర్ పాస్.. అక్కడ డివైడర్‌పై ఒక వ్యక్తి దీనావస్థలో ఉంటున్నాడు. చుట్టుపక్కల వారు ఇచ్చింది, తినడం.. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అక్కడే నివాసం కొనసాగిస్తున్నాడు. మానసికంగా ఇబ్బంది పడుతున్నాడన్న ఉద్దేశంతో చిరు వ్యాపారులు తమకి తోచింది ఇస్తూ వస్తున్నారు.

అయితే అటు వైపు నుండి రోజు ఉద్యోగానికి వెళ్లే వైద్య ఆరోగ్య శాఖ మలేరియ సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ కూడా మొదట్లో తనకి తోచింది ఆ వ్యక్తికి ఇచ్చేవాడు. కొద్దీ రోజులు పోయిన తర్వాత శ్రీనివాస్ కి అనుమానం వచ్చింది. అసలు ఎక్కడ నుండి వచ్చాడు. ఎక్కడికి వెళుతున్నాడు. అన్న సందేహాలు రావడంతో చిన్నగా అతనితో మాటలు కదపడం మొదలు పెట్టాడు. అయితే తెలుగు మాట్లాడటం రాని ఆ వ్యక్తి మొదట్లో ఏం చెబుతున్నాడో అర్ధం కాని పరిస్థితి శ్రీనివాస్ కు ఎదురైంది.

ఆ తర్వాత చిన్న అతని పేరు కనుక్కున్నాడు. వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. అతని దీనావస్థను చూసి చలించిపోయాడు. దీంతో ఎలాగైనా అతన్ని సొంత వారి వద్దకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అ వ్యక్తి చెప్పిన ఆధారాల ప్రకారం అతను అస్సాం రాష్ట్రానికి చెందిన సజ్జన్ బిలాల్‌గా గుర్తించారు. అక్కడ తన స్నేహితులను సంప్రదించి ఆ వ్యక్తి ఆనవాళ్లు చెప్పి వారితో మాట్లాడించాడు. చివరికి వారు గుర్తుపట్టి పది కుంచనపల్లి అండర్ పాస్ వద్దకు వచ్చారు. తమ వాడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పది రోజుల పాటు అలుపెరగకుండా సొంతవారిని వెదికి పట్టుకున్న శ్రీనివాస్ కు ధన్యవాదాలు చెప్పి తమ వాడిని వెంట తీసుకెళ్లారు.

అయితే నెల రోజుల క్రితం అస్సాంకు చెందిన సజ్జన్ బిలాల్ తమ సోదరులతో కలిసి పనుల నిమిత్తం రైలులో బెంగుళూరు వెలుతున్నాడు. ఈ క్రమంలోనే మంచి నీళ్ల కోసమని విజయవాడ రైల్వేస్టేషన్ లో దిగాడు. అతను తిరిగి వెళ్ళే సరికి రైలు వెళ్లిపోయింది. అతనికి తెలుగు బాష రాదు. తనవారిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చిన్నగా అటు ఇటు తిరుగుతూ కుంచనపల్లి అండర్ పాస్ వద్దకు వచ్చాడు. అక్కడున్న సజ్జన్ ను చూసిన శ్రీనివాస్ అతని వివరాలు తెలుసుకొని తన స్నేహితుల సాయంతో సజ్జన్ ను సొంతవారికి అప్పగించాడు. దీంతో చుట్టుపక్కల వారంతా శ్రీనివాస్ ను అభినందించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..