ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?

|

May 04, 2021 | 9:46 PM

9 Lakh Vaccines Distributed : రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్

ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?
Vaccines Will Be Distribute
Follow us on

9 Lakh Vaccines Distributed : రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 176 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందుకోసం రూ.346 కోట్లు వ్యయం కానుందన్నారు. నూతనంగా నిర్మించబోయే హెల్త్ సెంటర్లలో వైద్యులు, నర్సులు సహా పలు 1400 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టుల భర్తీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.165 కోట్ల భారం పడనుందన్నారు. రాష్ట్రంలో 166 మండలాల్లో ఒక పీహెచ్సీ మాత్రమే ఉందన్నారు. ఏజెన్సీ మండలాల్లో కూడా సీహెచ్సీల నిర్మాణం చేపడతామన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో డిశ్ఛార్జిలు పెరిగాయన్నారు. నేటి మధ్యాహ్నానానికి రాష్ట్ర వ్యాప్తంగా 6,319 ఐసీయు బెడ్లు ఉండగా, 5,743 వినియోగంలో ఉన్నాయన్నారు. కర్నూల్ లో 533 ఐసీయూ బెడ్లకు 300 బెడ్లపై కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారని, మరో 233 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 68 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు 21,858 ఉండగా, 20,108 బెడ్లు నేటి మధ్యాహ్నానానికి నిండిపోయాయన్నారు 1,750 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 21,898 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేటి రాత్రికి మరో 12 వేల డోసులు రాబోతున్నాయని, వాటిని కూడా కూడా రేపు వివిధ ప్రభుత్వాసుపత్రులకు అందజేస్తామని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 14,030 రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందజేశామన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,856 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచారాల నిమిత్తం 6,592 కాల్స్, టెస్టులకు 3,726, అడ్మిషన్లకు 2, 976, కరోనా టెస్టు ఫలితం కోసం 2,224 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.

అనాథ పిల్లలను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోకుడదు.. అలాంటి పిల్లల గురించి పోలీసులకు చెప్పండి.. కేంద్ర మంత్రి..

AP Corona Lockdown: రేపటినుంచి ఏపీలో వాహనాలపై ఆంక్షలు.. సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షల అమలు..