AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: ఎండలకు తట్టుకోలేక ఏసీ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో చౌకైన వాటి లిస్ట్ మీ కోసం

వేసవి కాలం మొదలైంది. సూర్యుని వేడి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ఏసీల కొనేందుకు క్యూలు కడుతున్నారు. కొంతమంది.. ఏసీలు చాలా ఎక్కువ ధరలు ఉంటాయని వాటిని కొనడం మన వల్ల కాదని లైట్ తీసుకుంటారు.

Air Conditioner: ఎండలకు తట్టుకోలేక ఏసీ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో చౌకైన వాటి లిస్ట్ మీ కోసం
Ac
Aravind B
| Edited By: |

Updated on: Apr 17, 2023 | 10:17 AM

Share

వేసవి కాలం మొదలైంది. సూర్యుని వేడి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు కొనేందుకు క్యూలు కడుతున్నారు. కొంతమంది.. ఏసీలు చాలా ఎక్కువ ధరలు ఉంటాయని వాటిని కొనడం మన వల్ల కాదని లైట్ తీసుకుంటారు. కానీ ఈ ఏసీల ధరలను చూస్తే మాత్రం ఎలాగైన కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రూ.30000 లోపే మంచి ఏసీలు అందబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి

1. వీర్‌పూల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ

ఈ ఏసీ ధర 48 శాతం డిస్కౌంట్ తో రూ.31,990 కే లభిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా అమెజాన్ లో రూ.1,750 వరకు డిస్కౌంట్ ఇచ్చే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఏసీకి 4.9 కిలోవాట్ల కూలింగ్ పవర్ సామర్థ్యం ఉంది. ఇందులో 6వ సెన్స్ టెక్నాలజీ, డస్ట్ ఫిల్టర్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ (140 V ~ 285 V), టెంపరేచర్ హిడ్డెన్ డిస్‌ప్లే, 34db డెసిబుల్స్ నాయిస్ లతో కూడిన ఫీచర్లు ఉన్నాయి.Whirpool 1.5 ton 3 star AC

2.లోయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

దీని ధర 44 శాతం డిస్కౌంట్ తో రూ.32,799 కి లభిస్తుంది. క్రెడిట్ కార్టల ద్వారా రూ.1750 వరకు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. దీని కూలింగ్ సామర్థ్యం 4.74 కిలోవాట్స్. ఇందులో 5-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్ కూడా ఉంది.

Lloyd 1.5 ton 3 star inverter split AC

3. గోద్రెజ్ 1 టన్ 3 స్టార్, 5-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

అమెజాన్ లో 31 శాతం తగ్గింపుతో రూ.29,490 కే ఈ ఏసీ దొరుకుతుంది. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని కూలింగ్ సామర్థ్యం 3.5 కిలోవాట్స్. ఇందులో ఇన్వర్టర్ తో కూడిన 5-ఇన్-1 కన్వర్టబుల్ సాంకేతికత, ఐ-సెన్స్ టెక్నాలజీ, 100 శాతం కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్ కాయిల్స్, కనెక్టింగ్ ట్యూబ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Godrej 1 ton 3 star 5 in1 convertible cooling inverter split AC

4. వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

వాల్యూ డే ఆఫర్ కింద 55 శాతం డిస్కౌంట్ తో ఈ ఏసీ రూ.31,999 కే లభిస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ ఉంటుంది. దీని కూలింగ్ సామర్థ్యం 1.5 కిలోవాట్స్. ఈ ఏసీలో డస్ట్ ఫిల్టర్, యాంటీ మైక్రోబయాల్ ప్రొటెక్షన్, యాంటీ కొరెసివ్ కోటింగ్, ఎల్‌ఈడీ డిస్‌ప్లే , టర్బో, అడ్జస్టబుల్ కూలింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

5. అమెజాన్ బెసిక్ టన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

బ్లాక్ బస్టర్ వాల్యూ డే కింద 43 శాతం డిస్కౌంట్ తో దీని ధర రూ.29,990. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Ac 5