Heart On Right Side: మీకు నిఖిల్ హీరోగా నటించిన ‘కేశవ’ చిత్రం గుర్తుందా..? అందులో హీరో ఓ అసాధారణ సమస్యతో బాధపడుతుంటాడు. అదే.. అందరికీ ఎడమ వైపు ఉండాల్సిన గుండె ఈ సినిమాలో హీరోకు మాత్రం కుడివైపు ఉంటుంది. రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’లోనూ హీరో ఇలాంటి పాత్రలోనే కనిపిస్తాడు. ఇదంతా సినిమా కాబట్టి వినడానికి, చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా హృదయం కుడివైపు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. నమ్మడానికి కూడా అసాధ్యంగా ఉంటుంది కదూ! కానీ ఇలాంటి ఓ ఘటన నిజంగానే జరిగింది. అమెరికాకు చెందిన ఓ యువతి గుండె కుడి వైపు ఉంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల క్లారీ మక్ అనే యువతి కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది. దీంతో పరీక్ష చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు సూచించిన మేరకు కొన్ని మందులు వాడింది. అయితే దగ్గు ఎంతకూ తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్య ఉందా? అని భావించిన వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సాధారణంగా ఎడమవైపునకు ఉండాల్సిన గుండె.. క్లారీ మక్‌కు మాత్రం కుడి వైపు ఉంది. దీంతో క్లారీ తీవ్ర ఆందోళనకు గురైంది. ఇంతకీ గుండె కుడి వైపునకు ఉండడానికి గల కారణాన్ని వైద్యులు వివరిస్తూ.. దీన్ని వైద్య భాషలో ‘డెక్స్‌ట్రోకార్డియా’ అంటారని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని అంతటినీ క్లారీ టిక్‌టాక్ వీడియో చేసి పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
Housing scheme : ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించడం ఒక చరిత్ర : శ్రీరంగనాధ్ రాజు
Patanjali IPO: ఐపిఓగా అవతరిస్తున్న పతంజలి.. ఎప్పుడో డేట్ చెప్పిన బాబా రామ్‌దేవ్