Telangana: 18 నెలలకే ఎంత కష్టం.. చిన్నారి బతకాలంటే రూ. 16 కోట్ల ఇంజెక్షన్ కావాలి.. !

| Edited By: Balaraju Goud

Jul 04, 2024 | 4:13 PM

తెలంగాణలోని ఒక 18 నెలల చిన్నారి ప్రాణాలు నిలవాలంటే రూ. 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ భారత్‌కు వచ్చేసరికి మరిన్ని పన్నులు జత కానున్నాయి. చిన్నారి వైద్యం భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ పేద దంపతులు.

Telangana: 18 నెలలకే ఎంత కష్టం.. చిన్నారి బతకాలంటే రూ. 16 కోట్ల ఇంజెక్షన్ కావాలి.. !
Rare Disease Child
Follow us on

తెలంగాణలోని ఒక 18 నెలల చిన్నారి ప్రాణాలు నిలవాలంటే రూ. 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ భారత్‌కు వచ్చేసరికి మరిన్ని పన్నులు జత కానున్నాయి. చిన్నారి వైద్యం భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ పేద దంపతులు.

ఆ దంపతులకు మొదటి సంతానంలోనే పండంటి మగబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముద్దుముద్దుగా ఉన్న కొడుకును చూసి మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఆ దంపతులకు ఎన్నో రోజులు నిలవలేదు. ఆరు నెలల తర్వాత బాబు అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు చెప్పిన మాటలతో ఆ దంపతులిద్దరు కుప్పకూలిపోయారు. కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి బాబుకు వచ్చిందన్న వైద్యుల మాటలతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు.

బాబు ప్రాణాలతో ఉండాలంటే రూ.16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని.. లేదంటే బాబు దక్కడని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఆ దంపతులు. అసలే మద్య తరగతి కుటుంబం అందులోను మారుమూల గ్రామంలో జీవనం.. లక్షలు పెట్టి వైద్య చేయించే స్థోమత లేని ఆ కుటుంబం ఉన్నపలంగా రూ. 16 కోట్లు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక.. కన్న బిడ్డను బ్రతికించుకునేందుకు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో దాతలు ముందుకొచ్చి సాయం అందించి తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకుంటున్నారు ఆ దంపతులు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సతీష్, రవళి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహం అయింది. తొలిసూరి సంతానంగా ఏడాది క్రితం పండటి మగబిడ్డ పుట్టడంతో శ్రేయాన్ అని నామకరణం చేసుకున్నారు. బాబు రాకతో ఆ ఇంట్లో సంతోషాలు డబుల్ అయ్యాయి. కానీ ఆ సంతోషాలు ఎక్కువ రోజులు నిలవలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ బాబుకు ఆరు నెలలు‌ రాగానే తల్లిదండ్రుల గుండెలు పగిలే షాక్ విషయం తెలిసింది. పిల్లాడు బోర్లా పడటం లేదని.. అందరి పిల్లల్లా శరీరంలో మార్పులు రావడం లేదని గ్రహించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యుడి చూయించారు. పరీక్షించిన వైద్యుడు మీ బాబుకు కోటి మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాది వచ్చిందని, స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రాఫీ టైప్‌-2 అనే వ్యాధి సోకిందని, బాబుకు రెండేళ్లు నిండే లోపు ఈ ఇంజక్షన్ వేయించాలని సూచించారు. కానీ ఆ ఒక్క ఇంజక్షన్ ఖరీదు మాత్రం వందో, వెయ్యి, లక్షనో కాదని, ఏకంగా రూ. 16 కోట్లు ఉంటుందని తెలుపడంతో బాబు తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రాఫీ టైప్‌-2 అనేది జన్యు పరమైన వ్యాధి. ఇది సోకితే, కండరాలు బలహీనంగా మారడం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం మేనరిక వివాహాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మన చుట్టు ఉండే పరిసరాలు. ఎందుకంటే ఇవి క్రమంగా మన జన్యువులపై ప్రభావం చూపుతాయి. అలా ఒక వ్యక్తి జన్యువుపై ప్రభావం చూపుతూ, ఆ లక్షణాలు తర్వాత తరానికి కూడా బదిలీ అవుతూ ఉంటాయి. అందుకే ముందు తరాలకి ఉన్న ఎన్నో జబ్బులు ఆకస్మాత్తుగా ఇప్పటి తరంలో కనిపిస్తుంటాయంటున్నారు వైద్య నిపుణులు. అయితే చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవని తెలుపడంతో తమ కుమారుడిని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులిద్దరు అష్టకష్టాలు పడుతున్నారు.

తమ కొడుకుకు సోకిన వ్యాధిని నయం చేయాలంటే నొవార్టిస్‌ ఫార్మా తయారు చేసిన రూ.16 కోట్లు ఖరీదైన జొల్జెన్‌స్మా ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలియడంతో తమ స్థోమత సరిపోక.. కుమారుడిని ప్రాణాలతో కాపాడుకునేందుకు దాతల‌ సాయం కోసం ఎదురు చూస్తున్నారు శ్రేయన్ తల్లిదండ్రులు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం కావడం, అందులోను ఈ ఔషధం మనదేశంలో దొరకి అవకాశం లేకపోవడం.. విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి పరిస్థితులు ఉండటం.. అందులోను బిడ్డ పుట్టిన రెండేళ్లలోపే దీన్ని తీసుకోవాలని వైద్యులు హెచ్చరించడం ఆ కుటుంబాన్ని మరింత వేధిస్తోంది.

అయితే ఈ ఇంజక్షన్ దక్కడం కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి కేసులు మన తెలంగాణలో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దాతలు ముందుకొచ్చి బాబు శ్రేయన్ కాపాడాలని వేడుకుంటున్నారు వెంచపల్లికి చెందిన పడాల రవిళి, సతీష్ దంపతులు. రూ.16కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తే గానీ శ్రేయాన్ బతకడని తెలియడయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆ దంపతులు. శ్రేయన్ కు 18 నెలలు నిండటంతో ఇంజక్షన్ తీసుకునేందుకు మరో నాలుగు నెలలే గడువు ఉండడంతో ఏం చేయాలో తెలీక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తనకు ఏం జరిగిందో తెలియక మోముపై చిరు నవ్వులను చిందిస్తున్న ఆ 18 నెలల చిన్నారి చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు ఆగడం లేదు. చిన్నారి శ్రేయాన్ కు దాతల సాయంతో రూ. 16 కోట్ల ఇంజెక్షన్ అంది, మృత్యుంజయుడు అవ్వాలని మనమూ మనసారా కోరుకుందాం..!

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..