Zerodha CEO: ఆరోగ్యం కోసం 12 గంటల ఉపవాసం.. సీఈవో నితిన్ కామత్ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఇలా చేస్తే నెల జీతం బోనస్‌, రూ.10 లక్షల రివార్డు

|

Oct 07, 2022 | 9:48 PM

మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఫిట్‌నెస్‌ ఉండడమే కాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఆహారపు అలవాట్లను..

Zerodha CEO: ఆరోగ్యం కోసం 12 గంటల ఉపవాసం.. సీఈవో నితిన్ కామత్ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఇలా చేస్తే నెల జీతం బోనస్‌, రూ.10 లక్షల రివార్డు
Nithin Kamath, Ceo And Founder Of Zerodha
Follow us on

మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఫిట్‌నెస్‌ ఉండడమే కాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌ బ్రోకింగ్ కంపెనీ జెరోదా సీఈవో నితిన్‌ కామత్‌ తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. కొత్త ఫినెట్‌ ఛాలెంజ్‌ను తీసుకువచ్చారు. ఫిట్‌నెస్ ట్రాకర్స్ మీద డైలీ యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేసుకోవాలని, వాటిని సాధించిన వారికి ఒక నెలబోనస్ జీతం అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది కాలంలో ఈ లక్ష్యాల నిర్దేశించుకోవాలని, వాటిని సాధించాలని తెలిపారు. ప్రతి మనిషి ఆహార నియమాలు పాటిస్తూ జీవనం కొనసాగించాలని, అప్పుడే యాక్టివ్ గా ఉంటాడని చెప్పుకొచ్చారు.

కరోనా మహమ్మారి నుంచి చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. వర్కఫ్రంహోమ్‌లో భాగంగా ఎక్కువ సేపు కూర్చోవడం ఇప్పుడు కొత్త ధూమపానంగా మారుతోందంటున్నారు. ఇది రానురాను అంటు వ్యాధిగా మారుతోందని, అందుకే ఉద్యోగుల కోసం ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను తీసుకువచ్చినట్లు కామత్‌ చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ప్రతి రోజు వారి లక్ష్యాన్ని 90 శాతం పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని, వచ్చే సంవత్సరం నాటికి వీటిని నిర్ధేశించుకోవాలని వివరించారు. ఎవరైన లక్ష్యాలను చేరుకుంటారో వారికి రివార్డులు లభిస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వారికి ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఒక లక్కీ డ్రాను నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.10 లక్షల రివార్డును కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. నితిన్‌ కామత్‌ తన హెల్త్‌కు సంబంధించిన జాబితాను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆరోగ్య దినచర్యను ప్రోత్సహించడం, అనుసరించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతను ఆరోగ్యంగా ఉండేందుకు పాటిస్తున్న దినచర్యలు వెల్లడించారు. అయితే ఆడపాదడపా ఉపవాస ఆహారాలు వైద్య పరంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయంటున్నారు. అంతేకాకుండా ఉపవాసాలు పాటించడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. రక్త లిపిడ్‌ స్థాయిలను తగ్గడం ద్వారా వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందంటున్నారు. తక్కువ ఆహారంతీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని పలు అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి.

అయితే నితిన్ కామత్ తన ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచడంపై దృష్టి సారించారు. ఆరోగ్యం కోసం అతను తీసుకునే చర్యల గురించి తరచుగా ట్వీట్ చేశాడు. పడుకునే ముందు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తానని నితిన్‌ కామత్‌ తెలిపారు. నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందు ఎలాంటి పనులు చేయబోనని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి పొందేందుకు ప్రోటీన్‌ను తీసుకుంటానని వివరించాడు. 12 గంటల పాటు ఉపవాసం ఉండటం కూడా తన దినచర్యలో ఒక భాగమన్నారు. తన ఉద్యోగులకు ప్రకటించిన ఛాలెంజ్‌లో రోజుకు కనీసం 350 కేలరీలు ఖర్చవుతాయని కామత్ చెప్పారు. అంతకు ముందు ఏప్రిల్‌లో జెరోదా కంపెనీ బరువు తగ్గిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో కాస్త వ్యతిరేకత ఎదురైంది. ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని, బాడీ-షేమింగ్‌కు ఎలా దారితీస్తుందో చాలా మంది వాదించారు.

(source)

 

మధుమేహం ఉన్నవారికి ఉపవాసం మంచిదేనా?

ఢిల్లీలోని జస్ట్ డైట్ క్లినిక్‌లోని డైటీషియన్ జస్లీన్ కౌర్ టీవీ9తో మాట్లాడుతూ డయాబెటిస్‌ టైప్ I, టైప్ II డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ కాలం ఉపవాసం ఉండకూడదు. అలాగే భోజనం మానేయకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. మధుమేహం ఉన్నవారు అల్పాహారం కోసం ఒక గిన్నె నిండా అన్నం, సాబుదానా ఖిచ్డీ వంటి సరైన మొత్తంలో ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా రోటీని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఇది పీచుపదార్థం. రాత్రి భోజనానికి ఒక గ్లాసు పాలు తాగవచ్చు. చాలా మంది ఉపవాసం ఉండేవారు మూడు పూటలా తినకుండా ఉంటారని, అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా పరిమిత నిష్పత్తిలో మూడు పూటలా తినాలని ఆమె పేర్కొంది. మధుమేహం వ్యాధి ఉన్నవారు ఉపవాసాలకు దూరంగా ఉండాలంటున్నారు డైటీషియన్ జస్లీన్ కౌర్. డయాబెటిస్‌ వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఫైబర్‌ ఎక్కువ ఉండే పదార్థాలను తీసుకోవాలని, అతిగా వ్యాయమం కూడా చేయకూడదని వివరిస్తున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు కనీసం ఆరగంటకు పైగా వాకింగ్‌ చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం కారణంగా బరువు పెరిగిపోయారు. ఎందుకంటే ఇంట్లో కూర్చోని వర్క్‌ చేయడం తప్ప వాకింగ్‌ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీని కారణంగా వివిధ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఒక్కరు ప్రతి రోజు వ్యాయమం లాంటివి చేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకపోతే వివిధ ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలా కంపెనీల్లో ఉద్యోగుల ఫిట్‌నెస్‌ కోసం చర్యలు తీసుకున్నారు. ఫిట్‌నెస్‌ ఉండేందుకు నిబంధనలు విధించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి