Milk Boiling: పాలను పదే పదే మరిగిస్తున్నారా.? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.. ఎందుకంటే..

| Edited By: Ravi Kiran

Sep 22, 2021 | 7:27 AM

Milk Boiling: మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు చాలా ముఖ్యమైనవి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాల్సిందే. అలాగే...

Milk Boiling: పాలను పదే పదే మరిగిస్తున్నారా.? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.. ఎందుకంటే..
Follow us on

Milk Boiling: మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు చాలా ముఖ్యమైనవి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాల్సిందే. అలాగే రాత్రి డిన్నర్‌లో పాలతో తయారు చేసిన పెరుగు వేసుకోవాల్సిందే. ఇలా మన జీవితంలో పాలు ఓ భాగం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే పాల ప్యాకెట్‌ను ఓపెన్‌ చేయగానే ప్రతీ ఒక్కరు చేసే పని ముందుగా వాటిని మరగపెట్టడం. ఆ తర్వాతే కాఫీ లేదా టీ చేసుకుంటాం. అయితే కొందరు పాలను పదే పదే మరిగిస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ పాలను ఎక్కువసేపు మరిగిస్తే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్యాకెట్‌ పాలనే తీసుకుంటున్నారు. అయితే ఈ ప్యాకెట్‌పై పాశ్చురైజ్డ్ అని ఉంటుంది. దీనర్థం సేకరించిన పాలను ముందుగా డెయిరీ ప్లాంట్లలో పాశ్చురైజేషన్ చేశారని. అంటే.. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, అనంతరం చల్లారిన తర్వాత ప్యాకెట్లలో నింపుతారు. దీంతో పాలు తాజాగా ఉంటాయి. కాబట్టి అసలు పాలను మరిగించాల్సిన అవసరమే ఉండదు. తాగే ముందు వేడి చేస్తే సరిపోతుంది. ఇక పాలను పదే పదే మరిగించడం వల్ల వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్ ఏ, డీ, బీ1, బీ2, బీ12, కేలు కోల్పోతాయి.

బాగా మరిగించిన పాలలో పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పోషకాలు లేని పాలను తాగడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి పాలను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువసేపు మరిగించకూడదు. చల్లారాయి కదా.. అని మళ్లీ మళ్లీ వేడి మరిగిస్తే పోషకాలు లేని పాలను తీసుకున్న వాళ్లము అవుతాం.

Also Read: Kids Breakfast: వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఈ స్నాక్స్‌ను ట్రై చేయండి.. ఎప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వరు..

క్యాన్సర్‌ పేషెంట్లకు వ్యాక్సిన్‌ సురక్షితం..! కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి..

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..