Benefits Of Hing: ఇంగువతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాకవుతారు..

ప్రతి ఇంటి వంటగదిలో ఇంగువ ఉంటుంది. దీనిని సాంప్రదాయ మసాలాగా ఉపయోగిస్తారు. అన్ని కూరల్లో, ఇతర వంటకాల తయారీలో దీన్ని వినియోగిస్తారు.

Benefits Of Hing: ఇంగువతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాకవుతారు..
Hing Benefits
Follow us

|

Updated on: Oct 23, 2021 | 10:32 AM

ప్రతి ఇంటి వంటగదిలో ఇంగువ ఉంటుంది. దీనిని సాంప్రదాయ మసాలాగా ఉపయోగిస్తారు. అన్ని కూరల్లో, ఇతర వంటకాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. సాధారణంగా ఇతర సుగంధ ద్రవ్యాలను వంటల్లో రుచి,  మంచి రంగు కోసం కలుపుతారు. అయితే ఇంగువను మాత్రం సువాసన కోసం వాడతారు. కేవలం రుచి పెంచడానికే కాదండోయ్. ఇంగువతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పొట్ట సమస్యలకు ఇంగువను మంచి నివారిణిగా పరిగణిస్తారు. ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని పలు సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడతాయి. అలాంటి అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీని నియంత్రిస్తుంది

బీపీని నియంత్రించడానికి ఇంగువలో ఉండే పోషకాలు పనిచేస్తాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంతోపాటు రక్తాన్ని పలుచగా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి

మీకు జీర్ణక్రియ, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం మొదలైన వాటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, మీరు క్రమం తప్పకుండా ఇంగువను వంటల్లో భాగం చేసుకోవాలి. అంతే కాకుండా ఒక చెంచా నీళ్లలో ఇంగువను కరిగించి పొట్ట చుట్టూ రాసుకుంటే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం

యాంటీ-వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ఉండటం వల్ల… దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ సమస్యల చికిత్సలో ఇంగువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంగువ ఛాతీ బిగుతు నుండి ఉపశమనం పొందేందుకు కూడా పనిచేస్తుంది.

పంటి నొప్పి నుంచి ఉపశమనం

ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది పంటి నొప్పికి చాలా ఉపశమనం ఇస్తుంది.

ఎలా ఉపయోగించాలంటే..

పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, ప్రతి రాత్రి నిద్రించే ముందు ఇంగువ పొడి కలిపిన నీటిని తాగాలి. అర గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చిటికెడు ఇంగువ పౌడర్ కలపి తాగాలి.

Also Read: పిల్లలు లేరనే కారణంతో భార్యను గుండ్లకమ్మ జలాశయంలోకి తోసేశాడు