Immunity Boosting: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు.. సింపుల్ టిప్స్ మీకోసం..

|

Dec 05, 2022 | 4:40 PM

కోవిద్ మహమ్మారి ప్రభావం తర్వాత రోగనిరోధక శక్తి గురించి ప్రతి ఒక్కరూ కేర్ తీసుకుంటున్నారు. ఇమ్యూనిటి పవర్ తక్కువుగా ఉన్నవారికి రోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుగా ఉన్న వ్యక్తులు..

Immunity Boosting: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు.. సింపుల్ టిప్స్ మీకోసం..
Immunity
Follow us on

కోవిద్ మహమ్మారి ప్రభావం తర్వాత రోగనిరోధక శక్తి గురించి ప్రతి ఒక్కరూ కేర్ తీసుకుంటున్నారు. ఇమ్యూనిటి పవర్ తక్కువుగా ఉన్నవారికి రోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుగా ఉన్న వ్యక్తులు ఏదైనా వైరస్ ను తట్టుకునే శక్తి ఎక్కువుగా ఉంటుంది కాబట్టి.. వారికి రోగాలు వచ్చే అవకాశం తక్కువుగా ఉంటుంది. గత కొంతకాలంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి వ్యక్తిలో రోగనిరోధక శక్తి చాలా అవసరం.అయితే మీ టీతో పాటు కొన్ని మూలికలు కలిపి తీసుకుంటే.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. సీజన్ మారుతున్న సమయంలో, చలికాలంలో ఫ్లూ, ఫీవర్, దగ్గు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంది. అందుకే అటువంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే దీని కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రోజూ తాగే టీతోపాటు.. కొన్ని పదార్థాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలసుకుందాం.

యాలకులు

యాలకులు టీకి సువాసన ఇస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. యాలకులపొడి శరీరంలోని వైరస్ తో పోరాడే కణాలను పెంచడంలో సహాయం చేస్తుంది. ఎవరైనా జీర్ణ సమస్యలతో పోరాడుతున్నట్లయితే.. యాలకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తోంది.

తులసి

తులసి సహజంగా విటమిన్ సి, జింక్​తో కూడి ఉంటుంది. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడుతుంది. అదనంగా ఇది ఫైటోకెమికల్స్, బయోఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

అల్లం

అల్లం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన మసాలా కూడా. ఇది ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచుతుంది. ఫ్లూ నుంచి బయటపడటానికి సరైన నివారణ మాత్రమే కాదు, జీవక్రియను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ఉండే జింజెరాల్ రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదం చేస్తుంది.

ములేతి

దీనిని ఆంగ్లంలో లైకోరైస్ అని కూడా పిలుస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ములేతి మీ శ్వాసకోశాన్ని ఆరోగ్యంగా ఉంచే లక్షణాలతో నిండి ఉంటుంది. అదనంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బ్రహ్మి

ఆయుర్వేదంలో బ్రహ్మి అత్యంత ప్రజాదరణ పొందిన ఔషదంగా చెప్పుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండటానికి సహాయం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..