ఎటువంటి కారణం లేకుండానే నీరసంగా అనిపించడం.. మన ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు రావడం.. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలు మీరు కూడా ఎదుర్కొంటున్నట్లైతే.. మీరు మీ అలవాట్లను మార్చుకోవల్సి ఉంటుంది. ఈ విషపూరిత మూలకాలు మీ శరీరాన్ని అనారోగ్యానికి గురిచేసే ముందు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండండి. శరీరంలోని వ్యర్థాలను తొలించుకోవడానికి సులభమైన మార్గాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. దీనిని నిర్విషీకరణ పద్ధతి అంటారు. నిర్విషీకరణ ప్రక్రియలో తేలికపాటి ఆహారాన్ని తినండి. ఇది మీ బరువును కూడా తగ్గిస్తుంది. మన శరీర శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మీ కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.
ఆర్గానిక్ ఉత్పత్తులను తీసుకోండి
కల్తీ.. కల్తీ.. కల్తీ. ఈ రోజుల్లో ఆహార పదార్థాలు ఎంతగా కల్తీ అవుతున్నాయంటే వాటి నుంచి విషపూరితమైన రసాయనాలు మన శరీరంలోకి చేరుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులనే వాడండి. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఇది చాలా ముఖ్యం.
తక్కువ చక్కెర!
శరీరం నుంచి విషపూరిత మూలకాలను తొలగించడానికి.. జీవక్రియను పెంచడానికి మీరు చక్కెరను అంటే చక్కెరకు కూడా దూరంగా ఉండాలి. చక్కెరను ఎక్కువగా వాడటం అంటే మీరు తీయటి విషం తీసుకుంటున్నట్లే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు చక్కెర వాడకాన్ని తగ్గించుకోండి.
నీరు త్రాగడం చాలా ముఖ్యం
శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సులభమైన మార్గం ఎక్కువ నీరు త్రాగడం. రోజంతా రోజుకు 8-12 గ్లాసుల నీరు తాగాలని నిర్ధారించుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే టాక్సిక్ ఎలిమెంట్స్ మూత్రం లేదా చెమట ద్వారా బయటకు వస్తాయి.
నిమ్మరసం మేజిక్
రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగండి. దీని వినియోగం శరీరంలో క్షార పరిమాణాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. నిమ్మరసం అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ అని చెబుతారు. కాబట్టి ఇక నుంచి మీరు తప్పనిసరిగా రోజూ ఒక గ్లాసు నిమ్మరసం కూడా తీసుకోండి.
టీ, కాఫీకి బై-బై చెప్పండి
టీ, కాఫీని ఎక్కువగా తీసుకోవడం హానికరం. కాబట్టి హెర్బల్ టీ తీసుకోండి. హెర్బల్ టీ లేదా చమోమిలే టీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. హెర్బల్ టీ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది.
శ్వాస యోగ
శ్వాస వ్యాయామాలు తప్పకుండా చేయండి. శ్వాస వ్యాయామం అంటే లోతైన శ్వాస తీసుకోవడం. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ బాగా ప్రసరిస్తుంది.
ఈ అన్ని పద్ధతులతో మీరు మీ శరీరం నుంచి అన్ని రకాల టాక్సిన్స్ నుంచి బయటకు పంపించే ప్రయత్రాలు చేయండి. ఒకసారి ప్రయత్నించండి. మీరు చురుకుగా.. ఆరోగ్యంగా ఎలా ఉంటారో చూడండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..
Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..