Metabolism Booster: ఈ నాలుగు పాటించండి.. మీ జీవక్రియను మెరుగుపరుచుకోండి..

|

Sep 03, 2021 | 6:45 AM

Metabolism Booster: జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు.

Metabolism Booster: ఈ నాలుగు పాటించండి.. మీ జీవక్రియను మెరుగుపరుచుకోండి..
Workouts
Follow us on

Metabolism Booster: జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుండి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుండి వస్తుంది. మెటబాలిజం మెరుగ్గా ఉంటే, మీరు మరింత శక్తివంతంగా ఉంటారు.

రోజూ ఉదయాన్నే లేవాలి..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయాన్ని లేవాలి. మంచి నిద్ర పోవాలి. సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. అల్పాహారం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

ఆఫీసు వేళల్లో కూడా చురుకుగా ఉండండి..
చాలా మంది ఎక్కువసేపు ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. పని ఎక్కువ అవటం, ఇతర కారణాల కారణంగా ప్రజలు అలసిపోతుంటారు. ఇలాంటి వారికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. ఈ నేపథ్యంలోనే మీ మెటబాలిజాన్ని పెంపొందించడానికి, చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోండి. అప్పుడప్పుడు కాసేపు నడవండి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా.. పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారం మాత్రమే తినండి. ఇక సాయంత్రం వేళలో చిప్స్, చాక్లెట్లు, కేకులు వంటి అస్సలు తినకండి.

ఆహారం సరిగ్గా తినండి..
ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఆహారాన్ని నమలడం, జీర్ణం చేయడం, నిల్వ చేయడం వంటి ప్రక్రియలో మీ శరీరం కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఆహారంలో ఎక్కువ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కూడా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఉపకరిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల గంటల కొద్దీ ఆకలి వేయదు. తద్వారా అతిగా తినాలనే కోరిత సహజంగానే తగ్గిపోతుంది. జీవక్రియను నిర్వహించడానికి, కాయధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, బీన్స్, నల్ల మిరియాలు, అవోకాడో, కాఫీ, అల్లం మొదలైనవి తీసుకోవచ్చు.

వ్యాయామం..
మీ జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన మార్గం. వ్యాయామం చేయడం ద్వారా మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also read:

Health Tips: శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవడం లేదా? అయితే, ఈ వంటింటి చిట్కాను ప్రయత్నించండి..

Pralhad Joshi Dance: స్టేజ్ మీద స్టెప్పులేసి ఊదరగొట్టిన కేంద్రమంత్రి

Rain In Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. దారులన్నీ గోదారులే. ఏకంగా మూడు గంటలపాటు.