రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ తో బాధపడుతున్నారా.. యోగా మాత్రమే దానికి చికిత్స అంటున్న ఎయిమ్స్ వైద్యులు

|

Jul 19, 2024 | 10:01 AM

గత కొంత కాలం వరకూ వయసు పెరిగేకొద్దీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి వచ్చేది. ఇప్పుడు చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యక్తి తన దైనందిన పనులను కూడా సక్రమంగా నిర్వహించుకోలేడు. వ్యాధి కారణంగా శరీరం కూడా బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అదనపు బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించి మరింత నొప్పికి దారితీస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ తో బాధపడుతున్నారా.. యోగా మాత్రమే దానికి చికిత్స అంటున్న ఎయిమ్స్ వైద్యులు
Rheumatoid Arthritis
Follow us on

రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడడానికి స్పష్టమైన కారణం లేకపోయినా ఇది జన్యు పరమైన, పర్యావరణ కారకాల కలయికతో వస్తుందని ఓ నమ్మకం. ఈ వ్యాధి నియంత్రించబడే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంలోని కీళ్లలో విపరీతమైన నొప్పి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధి తీవ్రమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది. అయితే గత కొంత కాలం వరకూ వయసు పెరిగేకొద్దీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి వచ్చేది. ఇప్పుడు చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యక్తి తన దైనందిన పనులను కూడా సక్రమంగా నిర్వహించుకోలేడు. వ్యాధి కారణంగా శరీరం కూడా బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అదనపు బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించి మరింత నొప్పికి దారితీస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడితే చికిత్స కూడా పని చేయకపోవచ్చు. అప్పుడు రోజూ వ్యాయామం, యోగా ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో కూడా ఈ విషయమై పరిశోధనలు జరిగాయి. క్రమం తప్పకుండా యోగా చేసే వారి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తక్కువగా ఉంటుందని AIIMS పరిశోధనలో తేలింది. యోగా ద్వారా జన్యువులలో వచ్చే మార్పులను కూడా నియంత్రించవచ్చు. యోగా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు యోగా చేయాలని సూచిస్తున్నారు.

యోగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ఎలా నియంత్రిస్తుందంటే

యోగా చేయడం వల్ల శరీరంలో నొప్పి, బరువు తగ్గడంతో పాటు వాపు కూడా తగ్గుతుందని ఎయిమ్స్ న్యూఢిల్లీలోని అనాటమీ విభాగం ప్రొఫెసర్, ఎయిమ్స్ మీడియా సెల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ రీమా దాదా చెప్పారు. యోగా చేయడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు ఏదైనా కోమోర్బిడ్ డిప్రెషన్(అనారోగ్యం గురించి ఆందోళన) ఉంటే దాని తీవ్రత కూడా తగ్గుతుంది. యోగా చేయడం వల్ల ఈ వ్యాధితో బాధపడుతున్న వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. రోజువారీ పనులు కూడా సక్రమంగా చేసుకోగలుగుతారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తి క్రమం తప్పకుండా యోగా చేస్తే వ్యాధి అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

PCOD, PCOS నియంత్రణ

యోగా చేయడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అదుపులో ఉంటుందని కిమ్స్ పరిశోధనలో తేలిందని డాక్టర్ రీమా దాదా చెప్పారు. వ్యాధి తీవ్రమైన లక్షణాలను కూడా నియంత్రించవచ్చు. యోగా ఈ వ్యాధిని నియంత్రించడంలో మాత్రమే కాదు అనేక ఇతర వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. మహిళల్లో వచ్చే పీసీఓడీ, పీసీఓఏ వ్యాధులను కూడా యోగా ద్వారా నియంత్రించవచ్చు. యోగా, ధ్యానం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ సంబధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..