World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..

|

Apr 19, 2022 | 1:40 PM

World Liver Day 2022: ఒక వ్యక్తి ఆరోగ్యం విషయానికవ స్తే కాలేయం పాత్రం చాలా కీలకం అనే చెప్పాలి. కాలయం ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటారు.

World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..
Liver Health
Follow us on

World Liver Day 2022: ఒక వ్యక్తి ఆరోగ్యం విషయానికవ స్తే కాలేయం పాత్రం చాలా కీలకం అనే చెప్పాలి. కాలయం ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆరోగ్యం విషయంలో కాలేయం పాత్ర గురించి అవగాహన పెంచడానికి, కాలయానికి సంబంధించిన వ్యాధులు, పరిస్థితుల గురించి ప్రజల్లో చైతన్యం పెంచడానికి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటారు.

శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. ఇది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. మెదడు తర్వాత రెండవది. ఎందుకంటే మానవ శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, జీవక్రియపై ప్రతిబింబించే శరీరంలోని వివిధ కీలకమైన విధులకు కాలేయం బాధ్యత వహిస్తుంది. సాధారణంగా, హెపటైటిస్‌బి, సి, ఆల్కహాల్ లేదా డ్రగ్స్ దుర్వినియోగం వంటి ఇతర కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. అయితే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

చేయకూడనివి..
కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడు. ప్రాసెస్ చేసిన ఆహారాలకూ దూరంగా ఉండాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున..కాలేయంపై దుష్ప్రభావం చూపుతుంది. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతాయి. సంతృప్త, ట్రాన్స్ కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహారాలు అస్సలు తీసుకోవద్దు. మద్యం సేవించకూడదు. ఆల్కహాల్ డీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. దాంతో శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడంలో కాలేయం శ్రమించాల్సి వస్తుంది. మాంసాహారం కూడా అధికంగా తీసుకోవద్దు. చాక్లెట్లు, క్యాండీలు, కూల్‌డ్రింక్స్ వంటి అధిక షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు అస్సలు తినొద్దు.

ఏం చేయాలి..
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బచ్చలికూ, బ్రోకలీ, కాలే వంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. ఈ కూరగాయలు శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్, అవకాడోలు తినడం, ఆలీవ్ ఆయిల్‌తో వంటలు చేసుకోవడం ప్రారంభించండి. ఆరోగ్యకరమైన కాలెం కావాలంటే.. హైడ్రేట్‌గా ఉండటం ముఖ్యం. నీరు సహజమైన నిర్విషీకరణ ఏజెంట్‌గా పని చేస్తుంది. అలా కాలేయం శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు తినే ఆహారంలో పండ్లను అధికంగా చేర్చుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

Also read:

RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!