Working On Computer: మారుతోన్న కాలానికి అనుగుణంగా పనితీరులో కూడా మార్పులు కూడా వచ్చాయి. ఒకప్పుడు పనితీరుకు ఇప్పటి పనితీరుకు పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఏసీలో కంప్యూటర్ ముందు కూర్చొని పనులు చేస్తున్నారు. చెమట కూడా చిందకుండా రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే శారీరక శ్రమ లేకుండా చేసే ఈ పనివల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావనే విషయం తెలిసిందే. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే వారిలో పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఇప్పటికే నిపుణులు తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటో శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చొని పనిచేస్తే దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే కొందరిలో కంప్యూటర్ ముందు కూర్చున్న కొద్దిసేపటికే అలసిపోయిన భావన కలుగుతుంది. దీనికి గల కారణం విషయమై పరిశోధకులు తాజాగా ఓ విశ్లేషణను వివరించారు. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం ఒకే విధంగా కూర్చుంటే.. అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు. కొందరిలో ఇది కేవలం అరగంటకే మొదలువుందని, దీనివల్ల రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా వారు శ్వాస తీసుకునే విధానంలోనూ మార్పులు వస్తాయని దీనివల్ల ఆక్సిజన్ తగ్గడంతో కొద్దిసేపటికే అలసిపోయిన భావన కలుగుతుంది అని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. అందుకే దీర్ఘకాలంపాటు కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటికోసారి లేచి కాసేపు తిరగాలని సూచిస్తున్నారు.
Also Read: బెంగాల్ లో అప్పుడే హింస, బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ వర్గీయుల దాడులు, నివేదిక కోరిన కేంద్రం
మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‌కు జోడీగా ఆ హీరోయిన్ ?
కరోనాపై పోరాటంలో భారత్‌కు అండగా ఫైజర్ సంస్థ.. సంస్థ చరిత్రలోనే అతి పెద్ద విరాళం.!