Women Health: చాలా మంది మహిళలు రొమ్ము నొప్పితో బాధపడుతారు. ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే ముందుగా సాధారణ నొప్పులన్ని రొమ్ము క్యాన్సర్ కాదని తెలుసుకోండి. దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. ప్రధానంగా ఈ నొప్పికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు, రెండోది ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్. అయితే ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ కారణంగా మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదు. కానీ మీరు ఛాతీలో ఒకే చోట నొప్పిని కలిగి ఉంటే అది తగ్గదు లేదా పెరగదు. అలాగే కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో మీరు తప్పనిసరిగా నిపుణుడిని సంప్రదించాలి. రొమ్ము నొప్పికి గల కారణాలు, ఉపశమన చర్యలను తెలుసుకోవాలి.
1. హార్మోన్ల కారణంగా
సాధారణంగా పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అటువంటి పరిస్థితిలో రొమ్ము వాపు ఏర్పడుతుంది. నొప్పి గణనీయంగా పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే మెనోపాజ్ తర్వాత ఈ సమస్య ముగుస్తుంది. హార్మోన్ల వల్ల వచ్చే ఈ నొప్పి నెలసరి వచ్చే రెండు మూడు రోజుల ముందు పెరుగుతుంది.
2. ఫైబ్రోసిస్టిక్
స్త్రీల వయస్సు పెరిగే కొద్దీ వారి రొమ్ములలో తేడాలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో రొమ్ములో కొన్ని గడ్డలు ఏర్పడతాయి. వీటిని ఫైబ్రోసిస్టిక్ మార్పులు లేదా ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ టిష్యూ అంటారు. ఋతుస్రావం సమయంలో ఈ గడ్డలు పెద్దవిగా అనిపించవచ్చు. దీని కారణంగా మహిళలు చాలాసార్లు నొప్పిని అనుభవిస్తారు.
ఉపశమనం
1. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఐస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల నొప్పి, వాపు రెండింటిలోనూ ఉపశమనం లభిస్తుంది.
2. రోజువారీ స్నానానికి ముందు గోరువెచ్చని ఆలివ్‌ను, కర్పూరం నూనెతో కలిపి మసాజ్ చేయవచ్చు. దీని నుంచి మీరు ఉపశమనం పొందుతారు.
3. విటమిన్ E, విటమిన్ B6 ప్రాప్ పెన్ తీసుకోవడం. కావాలంటే రోజూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న వాటిని తినాలి. కండరాల వల్ల కలిగే నొప్పిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.